మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ నటించిన దేవర ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రికార్డులతో దూసుకుపోతుంది. ఆచార్య లాంటి భారీ డిజాస్టర్ తర్వాత కొరటాల దగ్గర నూంచి వచ్చిన దేవర ప్రేక్షకుల అంచనాలను అందుకుంది. తొలిరోజే రూ.170 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.
ఇక రెండో రోజు కూడా రూ.80 కోట్లకు పైగా కలెక్షన్లు అందుకుని దేవర రూ.200 కోట్ల మార్క్ వసూళ్లను అందుకుంది. హిందీలో కూడా దేవర అదిరిపోయే టాక్ తెచ్చుకుంది. మొదటిరోజు రూ.7 కోట్లు కలెక్షన్లు రాబట్టగా రెండో రోజు రూ.11 కోట్లపైగా రాబట్టింది.
ఇక ఈ సినిమా విడుదలై నేటితో మూడు రోజులు అవుతున్న కలెక్షన్ల విషయంలో మాత్రం తగ్గేదెలే అంటుంది.. అందులో భాగంగా మూడు రోజుల మీద ప్రపంచవ్యాప్తంగా రూ.304 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇలా మూడో రోజు కూడా దేవర రూ.80 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇదే విధంగా కలెక్షన్ల సునామీ రాబడుతుంటే మరో రెండు రోజుల్లోనే రూ.500 కోట్ల మార్క్ దాటుతుందని ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. ఇక మరి ఎన్టీఆర్ ఈ సినిమాతో ఇంకెన్ని రికార్డులు అందుకొంటాడో చూడాలి.