మన పాతతరం నటులలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఎస్వీ రంగారావు వంటి వారే కాకుండా ఎంతోమంది అగ్రనటులు, నటి మణులు కూడా ఉన్నారు.. అలాంటి వారిలో లెజెండ్రీ నటి సూర్యకాంతం కూడా ఒకరు. తన ప్రత్యేకమైన నటనతో ఇప్పటి తరం వారికి కూడా ఎంతో సుపరిచితురాలు. అలాంటి సూర్యకాంతం ఒక నటి మాత్రమే కాదు ఎంతో ప్రతిభాశాలి, హీరోయిన్ అవ్వాలని ఎన్నో కలలుకని అవకాశం వచ్చిన సమయంలో నెరవేర్చుకోలేక ఆమె పడిన కష్టాలు అన్ని ఇన్నిని కావు.
అదేవిధంగా ఆమె జీవితంలో కూడా ఇంత విషాదం ఉందా అని అనిపించక మానదు. పాత్ర ఏదైనా సరే వెండితెరకు పూర్తిస్థాయిలో న్యాయం చేసిన ఈమె సహజమైన నటనతోనే తన పాత్రలకు ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక అంతేకాకుండా గేయాలి అత్త పాత్రల్లో సూర్యకాంతం తప్ప మరెవరు చేయలేరని ఇప్పటికి అలాంటి పాత్రలు సినిమాల్లో వస్తుంటే ముందుగా సూర్యకాంతమే గుర్తొస్తుంది.
ఇక అదే సమయంలో సూర్యకాంతం చిన్నప్పటి నుంచి హీరోయిన్ అవ్వాలని ఎంతో ఆశపడేది. హీరోయిన్గా అవ్వాలని చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది. అయితే సూర్యకాంతంకు ముందుగా నారద నారద అనే సినిమాలో ఓ క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశం వచ్చింది. ఆ సినిమా తర్వాత సూర్యకాంతం కు సౌదామని అనే సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా షూటింగ్ సమయంలో ఈమెకు యాక్సిడెంట్ జరిగీ ముఖానికి గాయం కావడంతో అవకాశాన్ని కాస్త వదులుకుంది. అలా ఎన్నో కలలుకని చేతి వరకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకే పరిమితమైంది సూర్యకాంతం.