సీనియర్ హీరోయిన్ ఇంద్రజ కూతుర్ని చూశారా.. తల్లిని మించి పోయింది గా..!

టాలీవుడ్ సీనియర్ నటి ఇంద్రజా గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. 90లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిందామె. స్టార్ హీరోల సరసన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తన అందం అభినయంతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలుకు దూరమైంది. పిల్లలు కుటుంబ బాధ్యతలతో బిజీ అయిపోయింది. అయితే చాలామంది హీరోయిన్స్‌లాగానే సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది ఇంద్రజా. స్టార్ హీరోలకు తల్లిగా, అత్తగా నటిస్తూ మెప్పిస్తుంది. అలాగే బుల్లితెరపై జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయింది.

Evergreen Actress Indraja Exclusive Interview On Her New Innings ! - TV9 Weekend Special

ఇదే క్రమంలో తాజాగా ఈమె ప్రధాన పాత్రలో నటించిన మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం కూడా మంచి విజయం సాధించింది. సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఇంద్రజ ఫ్యామిలీ గురించి చాలామందికి తెలియద.. సోషల్ మీడియాలోనూ.. ఈ మే ఫ్యామిలీ మెంబర్స్ పెద్దగా కనిపించరు. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఇంద్రజా తమిళ టీవీ నటుడు అబ్సర్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. అయితే వీరివి వేరు వేరు మతాలు కావడంతో తల్లిదండ్రులు ఇంద్రజ పెళ్లికి ఒప్పుకోలేదు దాంతో ఇంద్రజ, అబ్సర్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ విషయం ఇంద్రజానే ఓ ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చింది.Indraja: ఇంద్రజ కూతురును చూశారా.. త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ కానీ… ? - NTV Teluguఇక ఈ జంటకు సారా అనే ఓ కూతురు కూడా ఉంది. త్వరలోనే ఈమె హీరోయిన్గా రాబోతుందని కూడా అంటున్నారు. ప్రస్తుతం చాలా సంగీతం నేర్చుకుంటుందట కొన్ని రోజుల క్రితం తన కూతురి గురించి ఇంద్ర‌జ ప‌లు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. భవిష్యత్ లో తను మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతుంది’ అని చెప్పుకొచ్చింది. కాగా సారా కూడా తల్లి ఇంద్రజ లాగే ఎంతో అందంగా ఉంది. దీంతో అభిమానులు, నెటిజన్లు సారాను హీరోయిన్ గా ట్రై చేయమంటున్నారు. మరి ఫ్యూచర్ లో సారా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Indrajaa Absar (@indrajaa_absar)