ప్రభాస్, తారక్ ఇద్దరు పాన్ ఇండియన్ స్టార్ల లక్కీ హీరోయిన్ తనేనా.. అన్ని బ్లాక్ బస్టర్లే.. !

టాలీవుడ్ రెబల్ స్టార్‌ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఇద్దరు పాన్ ఇండియ‌న్ స్టార్ హీరోలుగా మంచి ఇమేజ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొదటి చిన్న సినిమాలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. తర్వాత వరుస సినిమాలతో స‌క్స‌స్ అందుకుంటు తమ నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ ఇద్దరు హీరోస్.. రాజమౌళి తెర‌కెక్కించిన బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ సినిమాలతో ఒక్కసారిగా పాన్ ఇండియన్ స్టార్‌గా ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఇక ఇప్పటికే ప్రభాస్ పాన్ ఇండియన్ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక తారక్ ఆర్‌ఆర్ఆర్ తర్వాత మరోసారి దేవర తో పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు.

Did you know there are lots of “rumors” Prabhas & Kajal dated around late  2009-2010? It's said that the death of Prabhas' father and disapproval by  his uncle led to their break

ఈ క్రమంలో ప్రభాస్, ఎన్టీఆర్ ఇద్దరికీ కలిసొచ్చిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా అంటూ.. ఓ న్యూస్‌ తెగ వైర‌ల్‌గా మారుతుంది. దీనికి కారణం ఈ ఇద్దరు స్టార్ హీరోలతో ఆ హీరోయిన్‌ కలిసి చేసిన ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్ సక్సెస్ అవ‌డమే. ఇంతకీ ఆ ల‌క్కీ హీరోయిన్ ఎవరో కాదు.. కాజల్ అగర్వాల్. మొదట ప్రభాస్ – కాజల్ అగర్వాల్ కాంబోలో తెరకెక్కిన డార్లింగ్ మూవీ మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఈ జంటకు విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా దక్క్ఆయి. తర్వాత వీరి కాంబోలో మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా రూపొందింది. భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా కూడా బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుంది. అలా ప్రభాస్‌తో కాజల్ నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకోవడమే కాదు.. వీరి కాంబోకు కూడా మంచి మార్కులు పడ్డాయి.

Ntr-kajal-aggarwal-DN3x2 - Telugu Lives - Telugu Latest News

ఇక ఎన్టీఆర్ తో కాజల్ మొదట బృందావనం సినిమాలో కలిసిన నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తర్వాత వీరిద్దరి కాంబోలో తెర‌కెక్కిన మరో మూవీ భాద్‌షా. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇక కొంతకాలం వరుస ప్లాపులను ఎదుర్కొన్న ఎన్టీఆర్‌కు ఆ గ్యాప్ తర్వాత త్రో బ్యాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన మూవీ టెంపర్. ఈ సినిమాలోను కాజల్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఇంతేకాదు జనతా గ్యారేజ్ సినిమాల్లో ఎన్టీఆర్ కోసం కాజల్ అగర్వాల్ ఓ స్పెషల్ సాంగ్‌లోను ఆడి, పాడింది. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా తారక్, ప్రభాస్ ఇద్దరు హీరోలకు కాజల్ లక్కీ హీరోయిన్గా మారింది. వీరి కాంబోలో వ‌చ్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో.. కాజ‌ల్‌కు కూడా స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజె క్రియేట్ అయింది.