చిరు, నాగ్, వెంకీల సక్సెస్ స్ట్రాటజీని అసలు టచ్ కూడా చేయని బాలయ్య.. తన రూటే సపరేట్..!

గత కొంతకాలంగా ఓటిటి ప్లాట్ ఫార్మ్‌ రావడంతో.. రీమేక్ ప్రభావం తగ్గింది. కానీ.. గతంలో రీమిక్ సినిమాలకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి మార్కెట్ ఉండేది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు రీమాక్ సినిమాలో ట్రెండ్ జోరుగా సాగేది. వేరే భాషల్లో హిట్ అయిన బ్లాక్ బస్టర్ సినిమాలను తెలుగులో రీమేక్ చేయడం.. ఆ సినిమాలు టాలీవుడ్ ప్రేక్షకులకు విప‌రీతంగా నచ్చడంతో.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా రీమేక్‌ల‌తో టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన వారిలో మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ కింగ్‌ అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ కూడా ఉంటారు.

Chiranjeevi: దీపావళి స్పెషల్..! చిరు, నాగ్, వెంకీ.. ఒకే ఫ్రేమ్ లో..  ఫ్యాన్స్ ఖుషీ - TeluguBulletin.com

వీరు కూడా రీమిక్ సినిమాలతో ఎన్నో సక్సెస్ లను అందుకున్నారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరైన బాలయ్య మాత్రం ఎందుకు పూర్తి విరుద్ధం. తన కెరీర్‌లో ఇప్పటివరకు ఆయన ఒక్క రీమిక్ సినిమాలో కూడా నటించలేదు అనడంలో అతిశయోక్తి లేదు. ఈయన ఇప్పటివరకు తన కెరీర్‌లో నటించిన ప్రతి సినిమా స్ట్రైట్ సినిమానే కావడం నిజంగా చెప్పుకోదగిన విషయం. చిరు, నాగ్‌, వెంకీ ఓవైపు పక్క భాషల్లో సినిమాలను తీసుకొని రీమేక్ చేసి సక్సెస్ అందుకుంటున్న సమయంలో కూడా.. బాలయ్య రీమిక్ సినిమాల వైపు వెళ్లలేదు.

Nandamuri Balakrishna Birthday, Age, Wiki, Biography, News, Works and More  - TvTalks

కేవలం కొత్త కథలతో రూపొందించిన సినిమాల్లో మాత్రమే నటిస్తూ.. స్టార్ హీరో ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. వాటితోనే ఎన్నో సక్సెస్‌లు అందుకున్నాడు. అలా కొత్త కథలతో మాత్రమే బాలయ్య నటిస్తూ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్ హీరోల లిస్టులో మొదటి వరుసలో నిలిచాడు. ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తే దూసుకుపోతున్న బాలయ్య.. బాబి డైరెక్షన్లో తన 109వ సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ 2 సినిమాలో బాలయ్య నటించనున్నాడు.