ఒకప్పుడు ఇండస్ట్రీలో సిల్క్ స్మిత పేరే పెద్ద సంచలనం. ఈ పేరు వింటే సౌత్ అభిమానులంతా తెగ ఉర్రుతలుగి పోయేవారు. సాధారణంగా స్టార్ హీరోలకు, హీరోయిన్లకు చాలామంది అభిమానులు ఉండడం కామన్. కానీ.. కేవలం సైడ్ క్యారెక్టర్స్ చేసే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు ఐటమ్ సాంగ్స్ చేసే డాన్సర్‌లకు అభిమానులు స్టార్ హీరోల రేంజ్‌లో ఉండడం అంటే అది సాధారణ విషయం కాదు. కానీ.. తను నటించిన సైడ్ క్యారెక్టర్స్, ఐటెం సాంగ్స్ తోనే.. ఏకంగా హీరో, హీరోయిన్లను మించిపోయి క్రేజ్ను సంపాదించుకుంది దివంగత నటి సిల్క్ స్మిత. అప్పట్లో కేవలం ఈమె సినిమాలో ఉందని తెలిస్తేనే.. థియేటర్స్‌కు అభిమానులు ఏగబడి వెళ్ళేవారు. ఇలా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోలను కూడా తలదన్నే క్రేజ్ ను సంపాదించుకున్న సిల్క్ స్మిత.. తర్వాత తన కెరీర్ ను విషాదంతో ముగించింది.
మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. అభిమానులందరినీ శోకసంద్రంలో ముంచేసింది. ఈ సంఘటన అప్పట్లో ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేసింది. ఇక ఆమె జీవిత కథ ఆధారంగా ప్రముఖ హీరోయిన్ విద్యాబాలన్ డర్టీ పిక్చర్స్ సినిమాలోను నటించిన సంగతి తెలిసిందే. మూవీ ఎలాంటి సక్సెస్ అందుకుందదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాలో కూడా ఎన్నో నిజాలను దాచి పెట్టి తీశారని అప్పట్లో వార్తలు వినిపించాయి. కాగా సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఎవరు అనే విషయంపై ఇప్పటికి ఎంతో మంది ప్రముఖుల పేర్లు తెరపైకి వస్తూనే ఉన్నాయి.
ఈ క్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా సిల్క్‌స్మిత ఆత్మహత్యకు ఒక కారణం అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అప్పట్లో రజినీకాంత్, సిల్క్ స్మితతో ప్రేమాయణం నడిపిందట. ఆమె లేకుంటే రజిని సినిమాలు చేసేవాడు కాదని.. వీళ్ళ కెమిస్ట్రీ ప్రేక్షకుల్లో హైలెట్ కావడం.. వీళ్ళ జోడి సెన్సేషన్ అవ్వడంతో ఇద్దరు నిజంగానే ప్రేమించుకున్నారని టాక్. అయితే నిర్మాతగా మారి నష్టపోవడంతో సిల్క్ స్మిత మానసికక్షోభకు గురైందట. అలాగే రజినీకాంత్ బ్రేకప్ చెప్పడం కారణంగానే సిల్క్ స్మిత అలా చెడు వ్యసనాలకు అలవాటు పడిందని.. అందుకే ఆమె చావుకు రజనీకాంత్ కూడా ఒక కారణం అంటూ కొన్ని వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు గానీ.. ప్రస్తుతం ఈ న్యూస్ మరోసారి వైరల్ అవుతుంది.