నందమూరి నటసింహం బాలకృష్ణ తన సినీ కెరీర్‌లో అడుగుపెట్టి తాజాగా 50 ఏళ్లు గడిచాయి. ఈ క్రమంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక బాలయ్య ప్రస్తుతం ఈ పొజిషన్‌లో ఉన్నాడంటే దానికి తండ్రి చలవె ప్రధాన కారణం. సీనియర్ ఎన్టీఆర్ అడుగుజాడల్లో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య.. రాజకీయాల్లోనూ శాసిస్తున్నాడు. అలాంటి బాలయ్యకు మొదటి నుంచి తండ్రితో విడదీయాలని బంధం ఉంది. తండ్రితో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోయినా.. సినిమాల్లో మాత్రం తండ్రి ద్వారానే అడుగుపెట్టాడు. అలాంటి బాలయ్య చివరికి తండ్రి సినిమాలకే పోటీ ఇస్తూ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్.. బాలయ్య సినిమాలు.. ఇతర విషయాల్లో వారి బంధం ఎలా ఉండేదో ఒకసారి తెలుసుకుందాం.
ఇక బాలయ్య తన తండ్రి మధ్య తండ్రి కొడుకులను మించిన గురు శిఫ్యుల అనుబంధం ఉండేది. ఇక బాలయ్య మొదటి మూవీ తాతమ్మ కల ఎన్టీఆర్ స్వీయ డైరెక్షన్‌లో నటించాడు. అలాగే.. బాలయ్య ఎన్టీఆర్‌తో కలిసి పలు సినిమాల్లో నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే సీనియర్ ఎన్టీఆర్ జీవిత చరిత్ర.. ఎన్టీఆర్ కథానాయకుడుగా తెరకెక్కింది. ఈ సినిమాలో కూడా బాలయ్య తండ్రి పాత్రలో నటించారు. అయితే బాలకృష్ణ.. ఎన్టీఆర్ జీవిత చరిత్ర పై సినిమా చేయడమే కాదు. తండ్రి సినీకెరీర్‌లో చేసిన ఎన్నో పాత్రల్లో ఈయన కూడా నటించాడు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినది శ్రీరాముడు, అర్జునుడు, శ్రీకృష్ణుడు, దుశ్యంతుడు, శ్రీకృష్ణదేవరాయలు పాత్రల లాంటి పౌరాణిక పాత్రల్లోనే కాదు.. తండ్రితో కలిసి బాలయ్య మొత్తం 12 సినిమాల్లో నటించాడు.
సీనియర్ ఎన్టీఆర్ డైరెక్షన్లో తాతమ్మకల సినిమాతో పాటు.. రామ్ రహీం, దానవీరశూరకర్ణ, అక్బర్ సలీం అనార్కలి, శ్రీమద్ విరాటపర్వం, అన్నదమ్ముల అనుబంధం, వేములవాడ భీమకవి, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం, రౌడీ రాముడు, కొంటె కృష్ణుడు, అనురాగ దేవత, సింహం నవ్వింది ఇలా ఎన్నో సినిమాల్లో నటించారు. ఇక సాహసమే జీవితం సినిమాతో సోలో హీరోగా మారిపోయిన బాలయ్య.. సినీ కెరీర్‌లో తన మొదటి సినిమా ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క ఏడాది కూడా గ్యాప్ తీసుకోకుండా నటిస్తూనే ఉన్నాడు. 50 ఏళ్ళ సినీ జీవితాన్ని పూర్తి చేసిన బాలయ్య.. ఇప్పటికీ ఎలాంటి సినిమా ఫంక్షన్స్ అయినా, రాజకీయ ప్రోగ్రామ్స్ అయినా తండ్రిని గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఆయన ఆశయాలని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్న ఈయన.. తను స్థాపించిన బసవతారకం ఆసుపత్రిని కొనసాగిస్తూ ఎంతోమంది పేదలకు చేయూతనిస్తున్న సంగతి తెలిసిందే. ఇవే కాదు.. ఎన్టీఆర్ పేరు పై ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ.. బాలయ్య మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇలా మంచితనం, సినిమాలు, రాజకీయాల్లోనూ తన వారసత్వాన్ని కొనసాగిస్తూ తండ్రికి తగ్గ తనయుడుగా దూసుకుపోతున్నాడు.