ఆ డైరెక్టర్ ప్రవర్తన చూస్తే నాకు భయమేసింది.. నాగార్జున షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఇప్పటికే.. ఎన్నో బ్లాక్ బ‌స్టర్ సినిమాలతో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోగా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ కింగ్‌గా దూసుకుపోతున్న‌ నాగార్జున.. లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెంచుకున్నారు. ఇక ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్.. విజయ్‌బిన్ని డైరెక్షన్లో నా సామి రంగ సినిమాతో చివరిగా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించారు. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా నాగ్‌తో కలిసి కీలక పాత్రలో నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు.

Nagarjuna filmography - Wikipedia

ఇక ఈ సినిమా తర్వాత ఈ ఏడాదిలో నాగార్జున ఒక సోలో సినిమా కూడా కమిట్ కాలేదు. అయితే నాగార్జున శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ధ‌నుష్‌ హీరోగా రూపొందుతున్న కుబేర సినిమాల్లో, లోకేష్ కనకరాజు డైరెక్షన్లో తెర‌కెక్కుతున్న రజినీకాంత్ కూలి సినిమాలోని కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తాజాగా ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇకపోతే నాగర్జున కొన్ని రోజుల క్రితం ఒక ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు దర్శకుడి గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Ram Gopal Varma – Asiateca Cine Asiático – Allzine

రామ్‌గోపాల్ వర్మ గురించి నాగార్జున మాట్లాడుతూ.. రామ్‌గోపాల్ వర్మ ఓట్కా తాగి.. కథ చెబుతూ ఉండేవాడని.. నేను కొంచెం తాగే వాడిని. కానీ ఆయన బాగా తాగేసేవాడు. ఆయన కథ చెబుతూ ఉన్నప్పుడు ముందు ఉన్న వస్తువులను కత్తుల అనుకుని స్టోరీ చెప్పేవాడు. నాకు అతని బిహేవియర్ చూస్తే చాలా భయమేసేది. దీంతో ఆయన స్టోరీ చెప్పేటప్పుడు సోఫాకి అవతల వైపు అతను.. మరోవైపు నేను కూర్చునే వాళ్ళం అంటూ నాగార్జున వివరించాడు. ప్రస్తుతం నాగార్జున చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి.