టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ స్టార్ హీరోగా ఇండస్ట్రీకి పెద్దగా వ్యవహరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. గతంలో నిర్మాత చేతిలో ఘోరంగా మోసపోయారట ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట వైరల్ గా మారుతుంది. ఇంతకీ అసలు ఆ నిర్మాత ఎవరు.. ఏం జరిగిందో.. ఒకసారి తెలుసుకుందాం. చిరంజీవి కెరీర్ ప్రారంభించకముందే కార్లు అంటే చాలా పిచ్చి ఉండేదట. ఈ క్రమంలో బ్రిటన్, జర్మనీ దేశాలకు చెందిన బ్రాండెడ్ కార్లు ఎన్నో కూడా చిరంజీవి గ్యారేజ్ లో ఉన్నాయి. ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కారులను తయారుచేసే రోల్స్ రాయల్స్ కంపెనీకి చెందిన క్వాంటం కార్ కూడా చిరంజీవి గ్యారేజ్ లో ఉందన్న సంగతి చాలామందికి తెలుసు.
అయితే చిరంజీవి తన మొదటి కారు మాత్రం సొంతంగా కొనుక్కోలేదట. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. తన మొదటి కార్ గురించి ఆయన చెబుతూ కెరీర్ మొదట్లో నా ఆరో సినిమా ఐ లవ్ యు చేస్తున్న టైంలో ఆ మూవీ నిర్మాత దగ్గర ఫియట్ కార్ ఉండేదని.. ఆ సినిమాలో బాగా యాక్టింగ్ చేసి నన్ను మెప్పిస్తే.. నీకు ఆ ఫియట్ కార్ గిఫ్ట్ గా ఇస్తానంటూ నిర్మాత చెప్పారని చెప్పుకొచ్చాడు చిరంజీవి. దానితో నేను ఎంతో కష్టపడి నటించా. మరి నా యాక్టింగ్ నిర్మాతకు నచ్చలేదు ఏమో.. తెలియదుగానీ.. కారు నాకు గిఫ్ట్ చేయలేదు. దీంతో నేను చాలా బాధపడ్డా అంటూ చిరంజీవి వివరించాడు. అప్పుడు మా నాన్నగారు నేను సంపాదించిన నా డబ్బులతో కారు కొనకుండా.. ఆయన దాచుకున్న డబ్బులతో నాకు కారు కొనిచ్చారు. అదే నా ఫస్ట్ కార్ అంటూ వివరించాడు చిరు.
అది ఫియట్ మోడల్ కార్.. ఏఏఎన్2087 దాని నెంబర్ అంటూ చెప్పుకొచ్చాడు. కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ లో ఆ కారు ఉండేదని.. ఆ కార్ కొన్న దగ్గర నుంచి నేను దానిని చాలా ఇష్టంగా చూసుకునే వాడినంట్టూ వివరించాడు. నేను మాత్రమే డ్రైవింగ్ చేసే వాడినని.. అది డ్రైవ్ చేస్తుంటే అందరూ మనల్ని చూస్తున్నారని అనుకునే వాడినని.. డ్రైవర్ ఉన్నా కూడా ఎక్కువగా అతనికి ఇచ్చేవాడిని కాదంటూ వివరించాడు. మా అమ్మ, నాన్న అప్పుడు నెల్లూరులో ఉండేవారు.. నెల్లూరు టు మద్రాస్, మద్రాస్ టు నెల్లూరు రావడానికి అదే కార్‌ను వాడేవాడిన అంటూ వివరించాడు. ఆకార్ కొన్న టైంలోనే సురేఖకు మ్యారేజ్ జరిగింది. ఆ కారులోనే మద్రాస్ అంతా ఇద్దరం కలిసి తిరిగేవాళ్లం. సురేఖ కూడా ఆ కార్ చాలా ఇష్టంగా చూసుకునేది అంటూ వివరించాడు. ప్రస్తుతం చిరంజీవి చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.