ఈ ఫోటోలో కనిపిస్తున్న అంజలి హీరో ఓ స్టార్ డైరెక్టర్.. మెగా, నందమూరి హీరోలనే డైరెక్ట్ చేసాడు.. గుర్తుపట్టారా..?

ఇండ‌స్ట్రీలో మొదట దర్శకులుగా అడుగుపెట్టిన చాలామంది.. తర్వాత నటులుగా మారి స్టార్ సెలబ్రెటీస్‌గా రాణిస్తున్న వారు ఉన్నారు. అలాగే మొదటి నటులుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. దర్శకలుగా మారి.. సినిమాలను తీస్తున్న సెలబ్రిటీలు ఉన్నారు. అలాగే ఈ పై ఫోటోలో హీరోయిన్ ఆంజలితో కలిసి హీరోగా నటించిన నటుడు ఇప్పుడు స్టార్ డైరెక్టర్గా టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. ఇక హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. కమర్షియల్ సినిమాలతో పాటు లేడి ఓరియెంటెడ్‌ సినిమాలతోను ఆకట్టుకుంటుంది.

Bimbisara director shocks with his Lineup

ఇక ఈ అమ్మడు తమిళ్‌లో నటించిన షాపింగ్ మాల్ సినిమా తెలుగులోను డబ్ అయినా సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అంజలికి మంచి ఇమేజ్ వచ్చింది. తర్వాత తెలుగు, తమిళ్ భాషల్లో వరుస‌ సినిమా ఆఫర్లను అందుకుంటు బిజీగా గడిపింది. ఇటీవల అమ్మడు 50 సినిమాలను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాతో 50వ సినిమా పూర్తయింది. ఓవైపు హీరోయిన్గా రాణిస్తూనే.. మరోవైపు సెకండ్ హీరోయిన్గా స్పెషల్ సాంగ్స్లో న‌టిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. నటించిన సినిమాలో ప్రేమలేఖ సినిమా ఒక‌టి. ఈ మూవీలో హీరోగా నటించిన ఆ వ్యక్తిని గుర్తుపట్టారా.. ఇతను ఇప్పుడు స్టార్ సెలబ్రిటీ, స్టార్ డైరెక్టర్. నందమూరి, మెగా హీరోలను డైరెక్ట్ చేశాడు. మొదట నందమూరి హీరోతో సినిమాను తెరకెక్కించి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న ఈ కుర్రాడు.. ప్రస్తుతం మెగాస్టార్ తో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికైనా ఇతనెవరో గుర్తుపట్టే ఉంటారు.

Bimbisara Movie: ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా కళ్యాణ్ రామ్ బింబిసార నుంచి  న్యూ పోస్టర్.. - Telugu News | Kalyan ram Bimbisara Movie Latest Poster on  NTR Birth Anniversary | TV9 Telugu

ఎస్ మీ గెస్ కరక్టే. అంజలితో పాటు ఈ ఫోటోలో కనిపిస్తున్న డైరెక్టర్ వశిష్ట. మొదటి నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కు బింబిసారా సినిమాతో బ్లాక్ బస్టర్ అందించిన ఈయన.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభ‌ర సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన వశిష్ట.. నా ఆటోగ్రాఫ్, సఖియా, భగీరథ, బన్నీ, వెంకటేష్ బాడీగార్డ్.. ఇలా ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. ఈ ఎక్స్పీరియన్స్ తోనే కళ్యాణ్ రామ్ ఈ సినిమా సక్సెస్ తో మెగాస్టార్ తో సినిమా తీసే అవకాశాన్ని దక్కించుకున్న వశిష్ట.. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమాని కూడా సోషియాఫాంటసీ యాక్షన్ డ్రామా గానే రూపొందిస్తున్నాడు ఈ యంగ్ డైరెక్టర్.