మోక్షజ్ఞ డబ్యూ మూవీ లో బాలయ్య అలాంటి రోల్.. స్టోరీ లైన్ ఏంటంటే..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ డబ్యూ సినిమాపై ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అదిగో ఇప్పుడు ఇంట్రీ.. అప్పుడు ఇంట్రీ అంటూ వార్తలు వినిపించిన‌ ఇప్పటివరకు అవి కార్య రూపం దాల్చ‌లేదు. అయితే తాజాగా మోక్షజ్ఞ మూవీ పై ఓ క్లారిటీ వచ్చేసింది. హనుమాన్‌తో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సారథ్యంలోనే మోక్షజ్ఞ మూవీ ఉండబోతుంది. ఇక ఇప్పుడు దాదాపు నిర్మాతలు కూడా ఫైనల్ అయినట్లు తెలుస్తుంది. మోక్షజ్ఞతో సినిమాకు ఇప్పటికే చాలామంది నిర్మాతలు సిద్ధంగా ఉన్నారట.

దర్శకుడు ప్రశాంత్ వర్మ కావడం.. అలాగే కొడుకు డబ్యూ సినిమా కోసం బాలయ్య కూడా ఓ స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవ్వడంతో.. ఈ సినిమాపై ఇన్వెస్ట్ చేయడానికి నిర్మాతలు కూడా ఆసక్తి చూపుతున్నారు. అయితే దాదాపుగా ఈ సినిమాకు ప్రొడ్యూసర్గా సుధాకర్ చెరుకూరి ఫైనల్ అయినట్లు తెలుస్తుంది. కాగా ఫైనల్ డిస్కషన్లు ఇంకా పూర్తి కాలేదని తెలుస్తుంది. వన్స్ ఆ ప్రాసెస్ అంత పూర్తయితే.. సినిమాకు భారీ లెవెల్ లో ఓపెనింగ్ ఉండనుందని.. దాదాపు అక్టోబర్ నెలలో ఈవెంట్ జరగవచ్చు అని సమాచారం.

ఇక ప్రశాంత్ వర్మ ఈ సినిమాను మంచి మైథ‌లాజికల్ టచ్ తో సోషియా ఫాంటసీ డ్రామాగా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అభిమన్యుడి పాత్రకు లింక్‌ ఉండే పాయింట్ ఏదో సినిమాలో ఉంటుందట. అంతేకాదు అర్జునుడి త‌ర‌హా పాత్రలో బాలయ్య చేయబోతున్నారని సమాచారం. మొత్తానికి ఈ భారీ సినిమాకు శ్రీకారం చుట్టడం కోసం స్ట్రాంగ్ లెవెల్ లో డిస్కషన్లు జరుగుతున్నాయి. ఈ క్ర‌మంలో ఆడియ‌న్స్లో మ‌రింత ఆశ‌క్తి నెల‌కొంది. ఇక ఈ సినిమా షూట్ ఎప్పుడు మొద‌లు అవుతుందో.. వేచి చూడాలి.