ఒకప్పటి టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ జయప్రదకు తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. తెలుగుతో పాటు.. తమిళ్, మలయాళ, హిందీ భాషల్లోనూ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించి తన ఖాతాలో వేసుకుంది. సీనియర్ ఎన్టీఆర్, శోభన్ బాబు, ఏఎన్ఆర్, కృష్ణ లాంటి టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ లోనూ అమితాబచ్చన్, ధర్మేంద్ర లాంటి స్టార్ హీరోలను సరసన నటించిన ఈ అమ్మడు.. అప్పట్లో పాన్ ఇండియా లెవెల్లో భారీ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో మొదటి వరుసలో నిలిచింది.
ఈ చిన్న వయసులోనే నటిగా కెరీర్ ప్రారంభించి.. అతి తక్కువ సమయంలోనే నెంబర్‌వన్ స్టార్ హీరోయిన్గా ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఇక తర్వాత హీరోయిన్గా అవకాశాలు తగ్గడంతో మెల్లమెల్లగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అంతేకాదు జయప్రద ఓ క్లాసికల్ డ్యాన్సర్ కూడా. చిన్నప్పుడు తెలుగులో భూమి కోసం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక మొదటి సినిమాకు.. జయప్రద తన13 ఏళ్ల వయసులో.. కేవలం రూ.10 రెమ్యూనరేషన్ తీసుకుందట.
1976లో కమలహాసన్ సరసన మన్మధ లీల సినిమాలో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. తర్వాత బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చి ఎన్నో హిట్ సినిమాలు తో ఆకట్టుకుంది. అతి తక్కువ సమయంలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది. జితేంద్రతో ఆమె నటించిన సినిమాతో బాలీవుడ్ లో బెస్ట్ పెయిర్‌గా ప్రశంసలు దక్కించుకుంది. ఇక వీరిద్దరు కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు. తన అద్భుతమైన నటనతో ఎన్నో అవార్డులు దక్కించుకున్న జయప్రద.. సినిమాలోనే కాదు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సక్సెస్ అయింది. ఇప్పటికీ ఈ అమ్మడు అడపా..దడపా సినిమాలో అవకాశాలు దక్కించుకుంటూ నటిస్తుంది.