రవితేజ తో లవర్ గా, భార్యగా, వదినగా నటించిన ఏకైక టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజ్ రవితేజకు ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకొని దూసుకుపోయిన రవితేజ.. గ‌త కొంతకాలంగా వరుస డిజాస్టర్లను అందుకుంటు డీలా పడిపోయిన సంగతి తెలిసిందే. మధ్యలో క్తాక్, వాల్తేరు వీరయ్య సినిమాలతో సక్సెస్‌లు అందుకున్నా.. మళ్లీ ట్రాక్ తప్పిన మాస్ మహారాజ్.. ప్రస్తుతం డిజాస్టర్ల బాటలో నడుస్తున్నాడు. ఈ క్రమంలో రవితేజకు సంబంధించిన వార్తలు ఎన్నో నెటింట వైరల్‌గా మారుతున్నాయి.

Balupu (2013) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

అందులో భాగంగానే రవితేజ సరసన లవర్ గా, భార్యగా, వదినగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా.. అంటూ ఓ న్యూస్ వైరల్‌గా మారుతుంది. ఇంతకీ ఆ అమ్మడు ఎవరు.. రవితేజతో కలిసి నటించిన ఆ సినిమాల లిస్టు ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. ఆ హీరోయిన్ మరెవరు కాదు కమల్ హాసన్ నటవారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్. మొద‌ట‌ మాస్ మహారాజ్ రవి తేజతో కలిసి శృతిహాసన్ బలుపు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల్లో శృతి రవితేజకు లవర్ గా నటించి మెప్పించింది. ఇక వీరిద్దరూ కలిసి నటించిన మరో మూవీ క్రాక్.

Ravi Teja Krack Movie Review in Telugu | Latest Telugu Movie News, Reviews,  OTT, OTT Reviews, Ratings

ఈ సినిమాలో రవితేజకు భార్యగా శృతిహాసన్ నటించిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ సక్సెస్‌లు అందుకుని కలెక్షన్లు కురిపించాయి. ఇక వదినగా వాల్తేరు వీర‌య్య‌ సినిమాలో నటించి మెప్పించింది. వాల్తేరు వీర‌య్య‌ సినిమాల్లో చిరు తమ్ముడుగా.. రవితేజ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. శృతిహాసన్.. చిరంజీవి లవర్‌గా కనిపించింది. ఈ క్రమంలో రవితేజకు.. చిరు లవర్ వరసకు వదిన అవుతుంది కదా. అలా రవితేజ వదిన పాత్రలను శృతిహాసన్ నటించింది. ఇక వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ మూడు సినిమాలు మంచి సక్సెస్‌లు అందుకున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం రవితేజకు సంబంధించిన ఈ న్యూస్ నెటింట‌ తెగ వైరల్‌గా మారుతుంది.