మలయాళ, తమిళ సినిమాల్లో హీరోయిన్గా నటించిన శ్రీవిద్య.. టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా చాలామందికి సుపరిచితమే. ఈ అమ్మడు దాదాపు 47 ఏళ్ళలో 800 కు పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే ఆమె సినీ కెరీర్‌లో ఎలాంటి డొకా లేకున్నా.. పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. ఇక అమ్హడు కొంతకాలం క్రితం క్యాన్సర్ కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అమ్మడు బ్రతికున్న సమయంలో కమలహాసన్ కి.. ఈమెకు మధ్యన జరిగిన ప్రేమాయణం గురించి చెప్పమంటూ.. ఓ ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నలకు రియాక్ట్ అయ్యింది. మాలయాళ, తమిళ ఇండస్ట్రీలోనే కాదు.. మా ఇద్దరి కుటుంబాలకు కూడా మా ప్రేమ తెలుసు. అందరూ మా ఇద్దరి పెళ్లి కావాలని అనుకున్నారు.
అయితే ఒకరోజు మా అమ్మ ఇద్దరిని పిలిపించింది. కమలహాసన్ నువ్వు ఇండస్ట్రీలో చాలా పెద్ద ఆర్టిస్ట్ అవ్వచ్చు. ప్రాక్టికల్ గా చెబుతున్నా.. మా అమ్మాయికి కూడా మంచి టాలెంటే ఉంది. ఆమె కూడా ఇండస్ట్రీలో గొప్ప ఆర్టిస్ట్ అంటూ చెప్పుకొచ్చింది. దాంతో కమలహాసన్ కు బాగా కోపం వచ్చింది. ఆ తర్వాత నాతో చాలా రోజులు మాట్లాడలేదు. కోపంతోనే మాట్లాడలేదేమో అని అనుకున్న.. అయితే కొంతకాలానికి కమల్ హాసన్ పెద్ద స్టార్ హీరో అయిపోయాడు. అదే టైంలో వేరే ఆవిడతో కమల్ హాసన్ ప్రేమాయణం.. పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిసింది. దీంతో నేను ఆశ్చర్యపోయా. నా మైండ్ ఒక్కసారిగా బ్లాక్ అయింది. నాకు ఎప్పటికీ కమల్ దక్కడన్న ఫీలింగ్ చాలా బాధ కలిగించింది అంటూ శ్రీవిద్య వివరించింది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో అన్నయ్య వేలంకణి, అపూర్వ రాగంగల్ సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. అయితే రియల్ లైఫ్ లోను వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.
కమల్ హాసన్ ఆమెకు ప్రపోజ్ చేశారు. శ్రీవిద్య కూడా పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పింది. ఆ ఇంటర్వ్యూలు చెప్పినట్టుగానే పెళ్లి చేసుకోకుండా శ్రీవిద్య తల్లి వారిని అడ్డుకుందట. కొన్ని నెలలకు కమల్ మరో నటి.. వాణి గణపతిని ప్రేమించి వివాహం చేసుకోగా.. అది తెలిసి శ్రీవిద్య డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని.. తర్వాత దర్శకుడు భారతన్‌తో లావ్ ఎఫైర్ అది కూడా బ్రేకప్ కావడం.. తర్వాత తిక్కనల్ చేస్తున్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ జార్జ్ థామస్ పరిచయం అవ్వడం.. అది కాస్త ప్రేమగా మారి ఇద్దరు చేసుకోవడం.. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో జార్జ్ బలవంతంతో మరోసారి సినిమాలోకి రావడం 1980లో డివోర్స్ తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో జార్జ్ తన నుంచి కొట్టేసిన డబ్బంతా తిరిగి తీసుకోవడానికి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది శ్రీవిద్య. చివరికి తన సంపాదన తను దక్కించుకుంది. అయితే 2003లో బ్రెస్ట్ క్యాన్సర్ తో శ్రీవిద్య మరణించింది.