ఏకంగా మూడుసార్లు ఆ మెగా హీరో సినిమాలను రిజెక్ట్ చేసిన అనుష్క.. ఎందుకంటే..?

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టికి తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి అనుష్క శెట్టికి అదే రెండు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎంతోమంది అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన సినిమాలతో లక్షలాది మంది అభిమానులను ఆకట్టుకుంది. టాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న నటించి మెప్పించిన స్వీటీ.. లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ సక్సెస్ అందుకుంది. ఇక గత కొంతకాలంగా సినిమాలకు దూరమైన ఈ అమ్మడు.. చివరిగా నవీన్ పోలిశెట్టి హీరోగా మిస్‌శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది.

Magadheera (2009) - IMDb

ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది. అయితే తర్వాత సినిమాలకు దూరమైన ఈమె.. ఇటీవల సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటిస్తుంది. కాగా ఎప్పుడు కూల్ గా.. హ్యాపీగా కెరీర్‌ను రన్ చేసే అనుష్క.. టాలీవుడ్ లో దాదాపు చిన్న, పెద్ద అని తేడా లేకుండా ఎంతోమంది హీరోలతో నటించింది. అయితే ఓ మెగా హీరోతో మాత్రం నటించడానికి ఛాన్స్ వచ్చిన మూడుసార్లు రిజెక్ట్ చేసిందట. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు రామ్ చరణ్. ఎస్ మీరు వింటుంది కరెక్టే. రామ్ చరణ్ తో.. అనుష్కకు నటించే ఛాన్స్ మూడుసార్లు వచ్చిందట. అయితే మూడుసార్లు అనుష్క ఆ సినిమా ఛాన్స్ లను రిజెక్ట్ చేసిందని తెలుస్తుంది. మొదట మగధీర సినిమాల్లో.. రాంచరణ్‌తో అనుష్క‌కు న‌టించే అవకాశం వచ్చిందట. అయితే ఈ సినిమా టైంలో ఎవో ప‌ర్స‌న‌ల్ కారణాలతో సినిమాను వదులుకుంద‌ట‌ అనుష్క.

Govindudu Andarivadele | Cinema Chaat

ఇక ఈ సినిమా తర్వాత కొంతకాలానికి వచ్చిన పక్కా మాస్ మూవీ రచ్చ సినిమాలోను అవకాశాన్ని రిజెక్ట్ చేసిందట స్వీటి. అయితే ఈ సినిమాలో స్టోరీ నచ్చకపోవడంతో సినిమాను రిజెక్ట్ చేసిందని సమాచారం. ఇక ముచ్చటగా మూడోసారి గోవిందుడు అందరివాడే సినిమాకు కూడా మొదట హీరోయిన్గా అనుష్క అయితే బాగుంటుందని భావించారట. కానీ.. అనుష్క ఈ సినిమాను కూడా రిజెక్ట్ చేసింది. ఇలా ఇప్పటివరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మూడుసార్లు సినిమాల నటించే ఛాన్స్ వచ్చిన అనుష్క రకరకాల కారణాలతో సినిమాలను వ‌దులుకుంది. ఇక అనుష్క రిజెక్ట్ చేసిన ఈ మూడు సినిమాలు మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ వార్త తెలిసిన అభిమానులంతా అనుష్క పై ఫైర్ అవుతున్నారు. ఈ మూడు సినిమాల్లో ఏ ఒక్క సినిమాలో నటించిన అనుష్కకు కూడా మరింత స‌క్స‌స్‌ వచ్చేది అంటూ కామెంట్‌లు చేస్తున్నారు.