వెంకటేష్ పై కోపంతో అందరి ముందే తన కళ్లద్దాలను నేలకేసి కొట్టిన ఆ డైరెక్టర్.. మ్యాటర్ ఏంటంటే..?

టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్న వెంకటేష్.. తనదైన శైలిలో కథ‌లని ఎంచుకుంటూ మంచి సక్సెస్‌లతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికీ యంగ్ హీరోలతో తలపడుతూ తన సినిమాల్లో నటిస్తున్న వెంకటేష్.. మొదటి ప్రముఖ స్టార్ ప్రోడ్యుసర్ దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే తండ్రి, అన్న ప్రొడ్యూసర్స్ అయినా.. నటిన పై ఇంట్రెస్ట్ తో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడు వెంకటేష్. అయితే మొదట చిన్న చిన్న సినిమాల్లో నటిస్తున్న క్రమంలో.. వెంకటేష్ ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడట.

దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు, వెంకటేష్ టాలీవుడ్ సూపర్ హిట్ కాంబినేషన్‌..  – News18 తెలుగు

ఇలాంటి క్రమంలోనే ఓ స్టార్ డైరెక్టర్ వెంకటేష్ పై కోపంతో తన కళ్లద్దాలను నేలకేసి కొట్టాడని ఓ న్యూస్ నెటింట‌ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు.. అంతలా వెంకటేష్‌కు ఆయన పై కోపం రావడానికి కారణం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. అతను మరెవరో కాదు డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు. ప్రస్తుతం ఆడపాదప సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహిస్తున్న ఈయన.. వెంకటేష్ కెరీర్ స్టార్టింగ్ లో నటించిన కలియుగ పాండవులు సినిమాకు దర్శకుడుగా వ్యవహరించాడు. ఈ సినిమా షూట్ టైంలో సీన్ చేసేటప్పుడు సరిగ్గా వెంకటేష్ నటించ‌లేద‌ట‌. ఒకటికి పది సార్లు చెప్పిన మళ్లీ అదే తప్పును రిపీట్ చేయడంతో.. వెంకటేష్ పై కోపం తెచ్చుకున్న రాఘవేంద్రరావు.. సెట్లో అందరి ముందే ఆయనపై అరిచి కళ్లద్దాలు నేలకేసి కొట్టడట.

Kaliyuga Pandavulu - Telugu Movie Review | Moviecation ::

దాంతో సెట్ లో ఉన్న వారంతో ఒక పూట వరకు ఎలాంటి పని మొదలు పెట్టలేదని.. ఈ విషయాన్ని తెలుసుకుని అక్క‌డ‌కు వచ్చిన రామానాయుడు రాఘవేంద్రరావుతో మాట్లాడి అతన్ని కూల్ చేశాడని.. మళ్లీ షూట్ ప్రారంభించేలా చేశారని అంటారు. ఇక ఈ సినిమాతో వెంకటేష్ బ్లాక్ బ్లాస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. మంచి ఇమేజ్ కూడా క్రియేట్ చేసుకున్నాడు. రాఘవేంద్రరావు ఏ సీన్ కోసమైతే వెంకటేష్ ను కోపగించుకున్నారో ఆ సీన్ల్‌లో వెంకటేష్ యాక్టింగ్ సినిమాకి హైలెట్గా నిలిచిందట. ఇక రాఘవేంద్ర అలా ఫైర్ కాబట్టే వెంకటేష్ అంతలా ఆ సీన్ పండించాడు. మొదట ఆయన కోపం పై కాస్త బాధపడినా.. తర్వాత అర్థం చేసుకుని ఆయన చెప్పినట్లు వెర‌క‌టేష్‌ నటించారు. సినిమా సక్సెస్ తర్వాత ఆ సన్నివేశానికి వచ్చిన రెస్పాన్స్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాడట. ఇక ఆయనపై రాఘవేంద్ర రావు కోపాన్ని పాజిటివ్గా తీసుకొని సినిమాల్లో నటించిన వెంకటేష్.. తర్వాత కూడా రాఘవేంద్రరావు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటించారు.