పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తూ తనదైన స్టైల్ లో సక్సెస్ అందుకుంటు ఉంటాడు. అలా ఇప్పటివరకు తన రెండున్నర దశాబ్దాల కెరీర్‌లో పవన్ కేవలం 28 సినిమాల్లో మాత్రమే నటించాడు. అయితే వాటిలో 11 రీమేక్ సినిమాలు ఉండడం విశేషం. ఇక వాటిలో కొన్ని ఇండస్ట్రియల్ హిట్స్ ఉన్నాయి. కొన్ని అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన సినిమాలు ఉన్నాయి. ఇంతకీ ఆ 11 రీమిక్ సినిమాలు ఏంటో.. వాటి రిజల్ట్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం.
గోకులంలో సీత
పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో రెండో సినిమాగా వచ్చిన గోకులంలో సీత ఆయన మొదటి రీమిక్ సినిమా. ఇది తమిళ్ గోకుల సీతైకి అఫీషియల్ రీమేక్. ఓమనైజర్ గా పవన్ నెగిటివ్ షేడ్స్‌లో నటించిన ఈ మూవీ 22 ఆగస్టు 1997లో రిలీజై సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అప్పట్లో టాప్ డైరెక్టర్ అయిన ముత్యాల సుబ్బయ్య ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
సుస్వాగతం
ఇక పవన్ మూడో సినిమా సుస్వాగతం కూడా తమిళ్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. విజయ్ హీరోగా నటించిన లవ్ టుడే సినిమా 1997లో రిలీజ్ కాగా ఈ సినిమాకు రీమేక్ గా సుస్వాగతం సినిమాను భీమినేని శ్రీనివాస్ తెరకెక్కించారు. ఈ సినిమాలో సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
ఖుషి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఖుషి సినిమా ఆయనకు ఏ రేంజ్ లో సక్సెస్ అందించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన ఈ సినిమా.. తన ఫస్ట్ ఇండస్ట్రియల్ హిట్ కావడం విశేషం. 2001లో రిలీజ్ అయిన ఈ సినిమా తమిళ్ మూవీ ఖుషి కి రీమేక్ గా తెరకెక్కింది. ఎస్. జె. సూర్య డైరెక్షన్లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
అన్నవరం:
పవర్ స్టార్ హీరోగా సిస్టర్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన మూవీ అన్నవరం. ఈ సినిమా కూడా హీరో విజయ్ నటించిన ఓ తమిళ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. ఇక ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
తీన్ మార్:
రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా వచ్చిన తీన్మార్ సినిమా కూడా హిందీ సినిమా లవ్ ఆజ్ కల్ కు రీమేక్ గా వచ్చింది. అయితే ఈ సినిమా రిజల్ట్ పవన్ అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ సినిమాల్లో డ్యూయల్ రోల్ లో నటించిన పవర్ స్టార్.. ఈ సినిమాతో ప్లాప్ ను ఎదుర్కొన్నాడు.
గబ్బర్ సింగ్:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బచ్చిన మరో రీమిక్ మూవీ గబ్బర్ సింగ్. హిందీ మూవీ దబాంగ్‌కు రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. 2012లో రిలీజ్ అయిన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఇక వరుస ప్లాపులతో కొట్టుమిట్టాడుతున్న పవన్ కళ్యాణ్‌కు.. ఈ సినిమా గ్రేట్ కం బ్యాక్ ఇచ్చింది. ఈ సినిమాతో పవర్ స్టార్ రికార్డ్స్ క్రియేట్ చేశాడు.
గోపాల గోపాల:
వెంకటేష్, పవన్ కళ్యాణ్ కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ గోపాల గోపాల. పవన్ కెరీర్‌లో 7వ రీమేక్. ఈ సినిమా హిందీ మూవీ ఓ మై గాడ్‌కు రీమేక్‌గా వచ్చింది. పవన్ కళ్యాణ్ ఇందులో దేవుడు పాత్రలో నటించాడు. అయితే గోపాల గోపాల ఇండస్ట్రీలో హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
కాటమరాయుడు:
పవన్ కళ్యాణ్, శృతిహాసన్ జంటగా నటించిన కాటమరాయుడు 2017 లో రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా తమిళ్ హిట్ మూవీ వీరన్ కి రీమేగా వచ్చింది. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
వకీల్ సాబ్:
కొంతకాలం తర్వాత పాలిటిక్స్‌లో బిజీ అయిన పవన్.. 2019లో మరోసారి వకీల్ సాబ్ సినిమాతో తన కం బ్యాక్ ను ప్రకటించారు. దాదాపు మూడేళ్ల కంబ్యాక్ తర్వాత.. పవర్ స్టార్ నుంచి వచ్చిన రీమిక్ సినిమా వకీల్ సాబ్. హిందీ హిట్ మూవీ పింక్‌కు రీమేక్‌గా తెరకెక్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.
భీమ్లా నాయక్:
మలయాళ హిట్ మూవీ రీమేక్ అయ్యప్పనుమ్ కోసియుమ్ కురిమేగా..రీమేక్‌గా భీమ్లా నాయక్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కూడా ఆడియన్స్ లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మంచి ఓపెనింగ్స్ అందుకుంది.
బ్రో:
ఇక పవర్ స్టార్ నుంచి చివరిగా వచ్చిన బ్రో మూవీ కూడా తమిళ్ మూవీ వినోదయ సీతంకు రిమేక్‌గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ టాక్ దక్కించుకుంది. ఇలా పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు తన కెరీర్‌లో ఏకంగా 11 రీమిక్ సినిమాల్లో నటించారు.