దేవర తర్వాత కొరటాల భారీ ప్రాజెక్ట్.. హీరో ఎవరు అసలు గెస్ చేయలేరు..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొర‌టాల శివ మొదట రచయితగా కెరీర్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తర్వాత దర్శకుడుగా మారి నెక్స్ట్ లెవెల్ సినిమాలతో స్టార్‌డంను సంపాదించుకున్నాడు. అయితే ప్రస్తుతం తారక్ తో తెర‌కెక్కిస్తున్న దేవరతో తన ఏంటో మరోసారి ప్రూఫ్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇక కొరటాల శివ సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు.. సోషల్ మెసేజ్ కూడా ఉండేటట్లు చూసుకుంటూ ఉంటాడు. ఇది సినిమాకు హైలెట్గా మారుతుంది. ఈ క్రమంలోనే కొరటాల తన సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ లో అందుకుంటున్నాడు. అలా ఇప్పటివరకు కొరటాలు తీసిన సినిమాలన్నింటిలో ఆచార్య తప్ప మిగతా సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. అలా టాలీవుడ్ టాప్ డైరెక్టర్గా కొరటాల శివ మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ఒక్క ఈయన టేకింగ్, స్క్రీన్ ప్లే లోను వైవిధ్యత చూపిస్తాడు. ఆయన కథల్లో కూడా కొత్తదనం కనిపిస్తుంది.

Koratala Siva : 'దేవరా' నీవే దిక్కయ్యా! - NTV Telugu

ఈ క్రమంలోనే తన మార్క్‌ ప్రూవ్ చేసుకున్నాడు కొరటాల. అన్ని రకాల ఆడియన్స్ కు కొరటాల సినిమాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను ఇలా పలు సినిమాలతో ఇండస్ట్రియల్ హీట్‌లు తన ఖాతాలో వేసుకున్న కొర‌టాల ఆచార్యతో డిజాస్ట‌ర్‌ అందుకున్నాడు. దీంతో ప్రస్తుతం కసితో కొరటాల.. ఎన్టీఆర్ దేవర సినిమా రూపొందిస్తున్నాడు. పాన్‌ ఇండియన్‌ సినిమాగా రూపొందుతున్న ఈ కథ.. రెండు పార్ట్‌లుగా రిలీజ్ కానుంది. ఇక సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. అంతే కాదు రెండో భాగం కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. ఈ క్రమంలోనే దేవర తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహించనున్న ప్రాజెక్ట్ ఏంటి..? ఏ హీరోతో చేయబోతున్నాడు..? అనే ఆసక్తి ఫిలిం వర్గాల్లో మొదలైంది. ఇక‌ తాజాగా కొరటాల ఓ హీరోని కలిశారని.. భారీ ప్రాజెక్టు గురించి చర్చలు జరిగినట్లు సమాచారం. ఇంతకీ ఆ హీరో ఎవరు..? ఆ సినిమా విశేషాలు ఏంటో..? ఒకసారి తెలుసుకుందాం.

pranav mohanlal fans Images • ........ (@rakrak) on ShareChat

ఇంతకీ ఆ సినిమా ఆ ప్రాజెక్టుకు హీరోను అస్సలు గెస్ చేయలేరు. అతను టాలీవుడ్ చెందిన హీరో కాదు. కోలీవుడ్ హీరో మోహన్‌లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్. ప్ర‌ణ‌వ్‌ని రీసెంట్ గా కొరటాల కలిసారట. ఓ పాన్ ఇండియా మూవీ గురించి ప్రణవ్‌తో డిస్కషన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రణవ్ కూడా దీనిపై పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వడంతో.. వీరిద్దరి కాంబోలో భారీ ప్రాజెక్ట్ రూపొందుతుందని టాక్. ఇక జనతా గ్యారేజ్ టైంలో మోహన్‌లాల్‌తో ఏర్పడిన పరిచయం కారణంగానే.. ప్రాణవ్‌తో కూడా కొరటాలకు ర్యాపో ఏర్పడిందట. ఈ క్రమంలో వీరి కాంబినేషన్‌కు తెరతీసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో హృదయం సినిమాతో హిట్ కొట్టిన ప్రణవ్ మోహన్ లాల్.. తర్వాత కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. ఈ క్రమంలోనే మెల్లిగా ప్రణవ్ కల్ట్‌ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. ఇక అని అనుకున్నట్లు జరిగి కొరటాల – ప్రణవ్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందితే మాత్రం.. దుల్కర్ సల్మాన్ తరహాలో మరో హీరో మన టాలీవుడ్‌కు పరిచయం అవడం ఖాయం అంటూ సినీ వ‌ర్గాల‌లో టాక్ న‌డుస్తుంది.