తాజాగా పవర్ స్టార్.. ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్స్ పురస్కరించుకున్న సంగతి తెలిసిందే. నెటింట పుట్టినరోజు విషెస్‌తో తెగ హంగామా జరిగింది. అభిమానులు.. సిని సెలబ్రిటీస్‌తో పాటు.. ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఎంతోమంది పవన్ కు పుట్టినరోజు విషెస్ తెలియజేస్తూ.. తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక మెగా కుటుంబానికి చెందిన చిరంజీవి, నాగబాబు, వరుణ్ తేజ్, నిహారిక, మెగా కోడలు లావణ్య, ఉపాసన స్పెషల్గా విషెస్ తెలియజేశారు.
ఏపీ ముఖ్యమంత్రి అయ్యాక.. మొదటి బర్త్డే కాబట్టి మరింత ప్రత్యేకంగా పవన్ గొప్పతనాన్ని వర్ణిస్తూ విషెస్ తెలియజేశారు. నిఖిల్ సిద్ధార్థ, సుదీర్, విజయశాంతి ఫిలిం, గీత ఆర్ట్స్ వారితో పాటుగా మెగా కోడలు లావణ్య త్రిపాఠికి జనసేన ధన్యవాదాలు తెలిపిన సంగతి తెలిసిందే. ఇకపోతే పవర్ స్టార్ గురించి తాజాగా వైరల్‌గా మారుతుంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఓజి సినిమాపై అదిరిపోయే అప్డేట్ సెన్సేషన్ సృష్టిస్తుంది.
తమిళ్ స్టార్ సింబు అద్భుతమైన పాట ఈ సినిమాలో పాడబోతున్నారని.. ఈయన హీరోనే కాదు మంచి సింగర్ అన్న సంగతి తెలిసిందే. తారక్, నిఖిల్, మనోజ్ లాంటి హీరోల సినిమాల్లో ప్రేక్షకులను ఆకట్టుకునే సాంగ్ సీనియర్ ఆలపించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం కూడా మరోసారి రంగంలోకి దిగబోతున్నాడట శింబు. దీనిపై త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రానుంది. ఈ వార్త విన్న డిప్యూటీ సీఎం అభిమానులు ప్రస్తుతం పండగ చేసుకుంటున్నారు. తమ ఆనందాని కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు.