ఈ అమ్మడుని గుర్తుపట్టారా.. 50 ఏళ్ల వయసులోనూ అందంతో ఏం కవిస్తుంది రా..!

సౌత్ నటి ఊర్మిళా మ‌టోండ్క‌ర్‌ చాలామందికి తెలిసే ఉంటుంది. రాంగోపాల్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కిన రంగీలా సినిమాతో బాలీవుడ్ తో పాటు సౌత్ ప్రేక్షకులకు దగ్గరన‌ ఈ ముద్దుగుమ్మ కేవలం సినీ నటిగానే కాదు.. రాజకీయ నాయకురాలిగాను.. చాలామందికి సుపరిచితమే. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఊర్మిళా.. హీరోయిన్‌గా మారి.. చాలాకాలం స్టార్ హీరోయిన్గా రాణించింది. కేవలం హిందీలోనే కాదు.. తెలుగు, తమిళ భాషలోను పలు సినిమాల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. వర్మ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. 2010 వరకు కంటిన్యూగా సినిమాల్లో చేస్తూ వచ్చింది. అయితే ప్రస్తుతం 50 ఏళ్ళు అయినా.. ఈ అమ్మ‌డి అందం మాత్రం వయసు తగ్గుతుందా.. పెరుగుతుందా.. అన్నట్లుగా రెట్టింపు అవుతుంది.

తాజాగా సోషల్ మీడియాలో ఊర్మిళా షేర్ చేసిన ఈ అందమైన ఫోటోలు తెగ వైరల్ గా మారడంతో.. 50 ఏళ్ల వయసులో ఇంత అందం మరి హీరోయిన్ కు సాధ్యం కాదు అంటూ.. ఈ ఏజ్ లోను తన అందాలతో ఏం కనిపిస్తోంది రా బాబు.. అంటూ పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక 1977లో కర్మ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఊర్మిల.. 1983లో నటించిన మ‌టోండ్క‌ర్ సినిమాతో మంచి ఇమేజ్ను సొంతం చేసుకుంది. మలయాళం లో అప్పట్లో చాణుక్య సినిమాలో నటించి మెప్పించింది. 1991లో హిందీ సినిమా నరసింహతో హీరోయిన్గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అప్పటినుంచి చాలాకాలం వరకు రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస అవకాశాలను దక్కించుకుంది. ఇక టాలీవుడ్ లో అంతం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. రాంగోపాల్ వర్మతో అప్పటికే ఉన్న పరిచయంతో రంగీలా సినిమాను నటించింది.

ఈ సినిమా అమ్మడి కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. 1995లో రిలీజ్ అయిన ఈ సినిమాకు ఊర్మిళ‌ను ఫిలింఫేర్ అవార్డ్ కి నామినేట్ చేశారు. ఈ సినిమాతో కుర్ర కారు హృదయాలను కొల్లగొట్టిన ఊర్మిళ.. తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఏడాదికి నాలుగు సినిమాల్లో నటిస్తూ దూసుకుపోయింది. ఇక ఇప్పటికీ అమ్మడి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇక భారతీయుడు సినిమాలో ఊర్మిళా నటించి పాన్ ఇండియా ఇమేజ్ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. కానీ.. ఆమె మాత్రం ప్ర‌స్తుతం అవకాశాలు వస్తున్న సినిమాలపై ఆసక్తి చూపడం లేదట‌.