జూనియర్ ఎన్టీఆర్ నటించిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ దేవర కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తూన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎప్పుడెప్పుడు సినిమాను థియేటర్స్ లో చూస్తామా అంటూ ఎదురు చూస్తున్న అభిమానులకు.. కిక్ ఇచ్చే న్యూస్ ఒకటి నెటింట వైరల్ గా మారింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ డబ్బులు అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న తారక్.. ముఖ్యంగా జపాన్‌లో ఓ రేంజ్‌లో క్రేజ్ దక్కించుకున్నాడు. ఇక దేవర విషయానికి వస్తే.. ఈ సినిమాలో తారక్‌తో పాటు.. బాలీవుడ్ సైఫ్ అలీ ఖాన్, జాన్వి కపూర్ ప్రధాన పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేవర సినిమా రిలీజ్‌కి ముందే జనాల్లో సందడి మొదలైంది.
ఇక ఈ కథపై ఇప్పటికే ఎన్నో వార్తలు వైరల్ గా మారాయి. అయితే సరైన స్టోరీ లైన్ ఏంటి.. అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. ఒకసారి రిలీజ్ డేట్ గురించి ఎన్టీఆర్ లుక్, క్యారెక్టర్ గురించి ఇండస్ట్రీలో ఎన్నో చర్చలు జరుగుతున్నా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ ఫిలిం సర్కిల్‌లో వైరల్ గా మారింది. ఇక సెప్టెంబర్ 27న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ కథలోని కొంత భాగం నిజజీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కిందట. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని వేలాదిమంది ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపించిందట. 1985 ఆంధ్రప్రదేశ్లో కారంచేడు ఘటన ఆధారంగా దేవర రూపొందుతుందని సమాచారం. దళితులపై జరిగిన హింస నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.
మరి ఈ వార్తలో నిజమెంటో తెలియాలంటే.. సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే. రీసెంట్గా సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. దీనిలో జూనియర్ ఎన్టీఆర్ రెండు ముఖాలతో కనిపించిన సంగతి తెలిసిందే. ఇద్దరు ఎక్స్ప్రెషన్స్ వేరు. కొత్త పోస్టర్ కి ఫేస్ ఆఫ్ ఫియర్ అనే ట్యాగ్‌ను జోడించిన మేకర్స్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దీంతో ఈ సినిమాలో ద్వీపాత్రభినయంలో తారక్ కనిపించబోతున్నాడని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై కూడా కన్ఫర్మేషన్ లేదు. ఇక సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలోవిలన్ రోల్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే రిలీజ్ తేదీలో ఎన్నో మార్పులు చేసిన మేకర్స్.. సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే షూటింగ్ టైంలో సైఫ్ అలీ ఖాన్ గాయపడడంతో మళ్లీ అక్టోబర్ 10 కి సినిమా రిలీజ్ డేట్ ను మార్చారు. కానీ.. మరోసారి ఇదే డేట్ ని సెప్టెంబర్ 27 కు షిఫ్ట్ చేశారు. ఇక ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకులు ముందుకు రానుంది