చిరు ఇంద్ర రికార్డును టచ్ చేయలేకపోయినా పవర్ స్టార్.. కానీ బాలయ్య, తారక్ రికార్డులు బ్రేక్.. !

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీరిలీజ్ ట్రెండ్‌ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా రీరిలీజ్‌ చేసిన గబ్బర్ సింగ్ సినిమాను ఫ్యాన్స్ ఫుల్ జోష్తో ఎంజాయ్ చేస్తూ వీక్షించారు. ఆంధ్రాలో వరద పరిస్థితుల కారణంగా ఎక్కువ హంగామా కనిపించకున్నా.. నైజాంలో మాత్రం అభిమానులు థియేటర్స్ దగ్గర సందడి చేశారు. ఇప్పుడు ఆ సినిమా కలెక్షన్ లెక్కలు ఏంటో ఒకసారి చూద్దాం. గబ్బర్ సింగ్ రిలీజ్.. తుఫాన్ పరిస్థితిల కారణంగా, వరదల కారణంగా పలుచోట్ల షోలు రద్దు చేసిన.. ప్రతికూల పరిస్థితుల్లో భారీగానే ముందస్తు బుకింగ్‌లు బుక్‌మైషోలో జరిగాయి. ఈ క్రమంలో 125 కే టికెట్లు అమ్ముడుపోయినట్లు సమాచారం. కానీ.. మురారి సాధించిన 161కే మార్క్‌ మాత్రం పవర్స్టార్ అధిగమించలేకపోయారు.

చెన్న‌కేశ‌వ‌రెడ్డి`గా బాల‌య్య అల‌రించి నేటికి 19 ఏళ్ళు!

అయితే మొత్తానికి మూడు లక్షల పైగా టికెట్లు అమ్మినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆంధ్రలో పెద్దగా సినిమాకు కలెక్షన్లు రాకపోయినా.. నైజంలో మాత్రం ఏకంగా రూ.2.75 కోట్ల వరకు వసూళ్ళు వ‌చ్చాయట‌. ఇక‌ కర్ణాటకలో కూడా స్పెషల్ షోలు ప్రదర్శించిన అన్ని చోట్ల హౌస్ ఫుల్ అయినట్లు తెలుస్తోంది. ఇక నార్త్ అమెరికాలో గబ్బర్ సింగ్,, రికార్డ్ స్థాయిలో రిలీజ్ చేశారు, అమెరికాచ‌ కెనడాలో 116 కు పైగా లొకేషన్లలో సినిమా వేయ‌గా.. 60 వేల డాలర్లు అంటే దాదాపు రూ.50 లక్షలు వ‌సూలైనట్లు ట్రేడ్ వర్గాలు వివరించాయి. అయితే ఇటీవల ఇంద్ర సినిమాకు ఏకంగా 65కే డాలర్లు వచ్చాయి. అలా ఇంద్రకు 65కే, గబ్బర్ సింగ్ 60 కే, చెన్నకేశవరెడ్డికి 51కే, సింహాద్రి కి 50 కే, మురారి కి 45కే డాలర్ల కలెక్షన్లు రావడంతో ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట‌ తెగ వైరల్ గా మారుతుంది. బాలయ్య, ఎన్టీఆర్, మహేష్ బాబు కలెక్షన్లను ఈజీగా టచ్ చేసిన పవర్ స్టార్ అన్న చిరు ఇంద్ర కలెక్షన్ల రికార్డులు మాత్రం టచ్ చేయలేకపోయాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక పవర్స్టార్ వరదలు, తుఫాన్‌లు ఉన్నప్పటికీ గబ్బర్ సింగ్ ఆల్ టైం రికార్డ్ ను సృష్టించడం అంటే సాధారణ విషయం కాదు. ఏపీ, తెలంగాణలో సెప్టెంబర్ 1,2 తేదీల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.5.26 కోట్ల వసుళ్ళ‌ను కొల్లగొట్టింది. మిగతా రాష్ట్రాల్లో రూ.80 కోట్ల షేర్.. రూ.1.5 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇలా మొత్తం ఇండియా వైడ్‌గా గబ్బర్ సింగ్‌ రూ.6 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది.