వామ్మో.. బాలయ్య ఆ డైరెక్టర్ ను కత్తితో పొడవడానికి వెళ్ళాడా.. అంత కోపానికి కారణమేంటంటే..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ కూ టాలీవుడ్‌ లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్షలాదిమంది అభిమానించే బాలయ్యకు.. మొదటి నుంచి కోపం ఎక్కువ అని.. ముక్కోపి, కోపిష్టి అని ఇండస్ట్రీలో టాక్‌ నడుస్తూ ఉంటుంది. తన సన్నిహితులు, స్నేహితుల నుంచి అభిమానుల వరకు.. ఆయన ఎన్నో సందర్భాల్లో వారిపై కోపాన్ని ప్రదర్శించిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయినా బాలయ్య అభిమానులు మాత్రం అతనిపై కాస్త కూడా అభిమానాన్ని తగ్గించుకోరు. అయితే ఇప్పటికే ఇలా తన కోపంతో ఎన్నో వివాదాలు చిక్కుకున్న బాలయ్య.. గతంలో స్టార్ డైరెక్టర్ దగ్గరకు ఏకంగా కత్తి పట్టుకుని పొడ‌వ‌డానికి వెళ్లడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు.. బాలకృష్ణకు అంతలా కోపం రావడానికి కారణం ఏంటో.. ఒకసారి చూద్దాం. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో కాదు టాలీవుడ్ టాలెంటెడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్. ఇది రూమర్ ఏమీ కాదు. స్వయంగా బాలకృష్ణ తన నోటి నుండి తానే చెప్పుకొచ్చాడు. రీసెంట్గా బాలకృష్ణ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను డైరెక్టర్ దగ్గరికి కత్తి పెట్టుకొని వెళ్లి మరీ బెదిరించా అంటూ వివరించాడు. అతను ఎవరో కాదు.. సుకుమార్ అంటూ చెప్పుకొచ్చాడు. రీసెంట్ గా నేను ఓ యాడ్ షూటింగ్‌లో పాల్గొన్న టైంలో పక్కన పుష్ప 2 సినిమా షూట్ జరుగుతుందని.. అలా అక్కడికి నా జేబులో కత్తి పట్టుకుని వెళ్లానంటూ వివ‌రించాడు.Nandamuri Balakrishna 🌹😍

ఇక మొదట బన్నీతో మాట్లాడి.. ఆ తర్వాత సుకుమార్‌ దగ్గరకు వెళ్లి కత్తితో బెదిరించా.. ఎందుకంటే సుకుమార్ అన్‌స్టాపబుల్ షో కి గెస్ట్ గా వచ్చిన టైంలో నాతో మూడు నెలల్లో సినిమా తీస్తాను అన్నాడు. కానీ.. ఇన్ని రోజులైనా కూడా నాతో సినిమా తీయడం లేదు. దాంతో నువ్వు నాతో సినిమా చేస్తావా.. లేదా కత్తికి పని చెప్పమంటావా.. అంటూ సుఖమార్‌ని బెదిరించానని ఫన్నీగా చెప్పుకొచ్చారు. సుకుమార్ బెదిరిపోయాడని.. ఆ తర్వాత షూటింగ్ సెట్ లో ఉన్న వాళ్ళందరూ ఈ విషయం తెలిసి నవ్వుకున్నారని బాలకృష్ణ వివరించాడు. ప్రస్తుతం బాలకృష్ణ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.