తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు, భారీ వరదల కారణంగా జరిగిన బీభత్సం ఎప్పటికప్పుడు అంతా చూస్తూనే ఉన్నాం. చాలా ప్రాంతాల్లో వరద నీటి వల్ల తీవ్రంగా నష్టం వాటిలింది. ఆర్ధికంగా కూడా ప్రభుత్వం చాలా లోటుపాట్లు ఎదుర్కోవాల్సి ఉంది క్రమంలో ప్రభుత్వం, అధికారులు ఇప్పటికే బాధితులను ఆదుకునేందుకు తమవంతు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. వాళ్ళతోపాటు.. మరోవైపు సినీ పరిశ్రమ కూడా వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది.
ఇక ఈ నేపద్యంలో ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయలు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. వరద, విపత్తు ప్రభావం నుంచి కోలుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి అందరు సహాయపడాలని.. నా వంతుగా రూ. 50 లక్షల చొప్పున ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ప్రకటిస్తున్నానంటూ ఎన్టీఆర్ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
అంతేకాదు, త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి ఎన్టీఆర్ స్వయంగా చెక్‌లను అందించనున్నాడని తెలుస్తుంది. ముఖ్యంగా తన మామయ్య.. ఏపీ సీఎం చంద్రబాబుని ఎన్టీఆర్ త్వరలో కలవనున్నాడట. ప్రసతుతం ఈ వార్త వైరల్ కావడంతో ఇది నిజంగా జరిగితే బాగుండు అంటూ ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ కలయికతో నందమూరి అభిమానులు, తెలుగుదేశం శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అనడంలో సందేహం లేదు.