బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా.. గత కొద్ది రోజులుగాఅకాల వర్షం భారీ వరదలతో రెండెతెలుగు రాష్ట్రాలు సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఈ విపత్తు కారణంగా ఇప్పటికే హారీ నష్టం వాటిల్లింది. ఈ సమయంలో ప్రజలకు అండంగా నిలిచేందుకు సహాయం అందించేందుకు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుంచి కూడా ఇప్పటికే ఎంతోమంది ముందుకు వచ్చారు. మొదటి జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయల సహాయం అందించగా.. మెల్లమెల్లగా ఒక్కొక్కరు తమ వంతు సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ.. రెండు తెలుగు రాష్ట్రాలకు తనవంతుగా సహాయాన్ని అందించాడు.
వరద బాధితులకు మొత్తంగా రూ.30 లక్షల విరాళం ప్రకటించాడు. ఆంధ్రప్రదేశ్‌కు రూ.15 తెలంగాణకు రూ.15 లక్షలు ఇస్తున్నట్లు వెల్లడించాడు. తను అందిస్తున్న డబ్బు కొంత మందికైనా సహాయపడితే సంతోషం అన్నట్లు చెప్పుకొచ్చాడు. భారీ వర్షాల వల్ల తెలుగు ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే.. ఇంకెవరికి ఇలాంటి పరిస్థితి రాకూడదనిపిస్తుందని.. ఆయన చెప్పుకొచ్చాడు. టాలెంటెడ్ డైరెక్టర్స్‌గా గుర్తింపు తెచ్చుకున్న త్రివిక్రమ్, నాగోవంశీ కూడా వరద బాధితుల కోసం సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. తమ సొంత నిర్మాణ సంస్థలైన హారిక అండ్ హాసిన్ క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ పేర్లతో.. రూ.50 లక్షల విరాళాన్ని ప్రకటించారు.
తెలంగాణకు రూ.25 లక్షలు, ఏపీకి రూ.25 లక్షల విరాళం అందించారు. ఈ విపత్తు వల్ల ఆస్తి, ప్రాణాలు నష్టాలు తమను ఎంతగానో కలిసి వేస్తున్నాయంటు చెప్పుకొచ్చారు. ఇక మరో యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా.. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి పది లక్షల విరాళాన్ని అందజేశాడు. సార్, తొలిప్రేమ సినిమాలతో మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని.. స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వెంకీ అట్లూరి కూడా రెండు తెలుగు రాష్ట్రాల కోసం తనవంతు సహాయం అందించాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి ఖాతాలో రూ.5 లక్షల విరాళాన్ని ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు.