టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని.. తన నటనతో లక్షలాది మంది అభిమానులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. అష్టాచమ్మా సినిమాతో హీరోగా అవకాశాన్ని దక్కించుకొని.. మెల్లమెల్లగా సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ స్టార్ హీరో ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం టైర్ 2 హీరోలలో టాప్ లో ఉన్న నానికి.. ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మొదట్లో ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఫేవరెట్ హీరోగా మారినా నాని.. మెల్లమెల్లగా తన విధానాన్ని మార్చుకుంటూ యాక్షన్ మూవీస్ కూడా నటిస్తూ ఇతర జానర్లలో ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.
అలా ఇప్పుడు తర్వాత మూవీ గురించి హింట్ ఇచ్చేసాడు నాచురల్ స్టార్. వైలెన్స్ ఎక్కువగా ఉన్నా సినిమాలో తను నటించబోతున్నాడని.. పిల్లల్ని థియేటర్లోకి అనుమతించడం కుదరదు అంటూ వివరించాడు. నాని చెప్పిన దాన్ని బట్టి చూస్తే హిట్ 3 గురించి ఆయన హింట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఎందుకంటే హిట్ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు వచ్చిన రెండు సినిమాలు హీరో పోలీస్‌గా చేస్తే.. సైకో పాత్రలో విలన్ భయపెట్టారు. ఇందులోనూ మూడో భాగం సైకో పాత్ర ఎంతో క్రూరంగా ఉండబోతుందని టాక్. ఇక నాని చేయబోయే అర్జున్ సర్కార్ పాత్ర అంతకుమించి అనేలా ఉండబోతుందట. దీని గురించి నాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించాడు.
ఇది కాకుండా దసరా ఫ్రేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో మరో సినిమాకు నాచురల్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా.. సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ లో రూపొంద నుందని.. పిరియాడికల్ యాక్షన్ డ్రామగా తెరకెక్కనున్న ఈ సినిమాలోను యాక్షన్ డోస్ గట్టిగా ఉండనుందని తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఇప్పటివరకు తనకు బలమైన ఫ్యామిలీ ఆడియన్స్‌ను సొంతం చేసుకున్న నాని.. ఇలా వైలెన్స్, యాక్షన్ సినిమాలు అన్వేషిస్తూ.. సినిమాల్లో నటిస్తే ఫ్యామిలీ ఆడియన్స్ కాస్త దూరం చేసుకుంటాడేమో.. అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.