రేట్లు పెంచేసినా అనిల్ రావిపూడి.. సినిమాకు ఏకంగా ఎన్ని కోట్లు అంటే..?

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. రాజమౌళి తర్వాత సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న డైరెక్టర్‌గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. అనిల్ కామెడీ, హీరోయిజంతో డిఫరెంట్ జానెర్‌లో సినిమాలను తెరకెక్కిస్తూ వరుస సక్సెస్‌లు అందుకుంటున్నాడు. స్టార్ హీరో అయినా.. కొత్త హీరో అయినా.. తన కథతో సక్సెస్ అందుకునేలా డైరెక్టర్ తన సత్తా చాటుతున్నాడు. అని జోన‌ర్‌ల‌కు తగ్గట్టుగా ప్రేక్షకులను మెప్పించే సినిమాలను తెర‌కెక్కిస్తూ మంచి బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్న అనిల్.. సూపర్ స్టార్ మహేష్ కి కూడా తన కామెడీ టచ్ తో బ్లాక్ బస్టర్స్ అందించిన సంగతి తెలిసిందే.

Director Anil Ravipudi and Venkatesh upcoming movie news going viral in  social media | Anil Ravipudi: అనిల్ రావిపూడి, వెంకటేశ్ కాంబినేషన్ మూవీపై  కన్‌ఫ్యూజన్ - ఇంతకీ దీని కథ ఏంటి?

ఇక చివరిగా బాలయ్య బాబు సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. స్టార్ దర్శకుడుగా టాలీవుడ్‌లో చెరగని ముద్రవేసుకున్నాడు. ప్రస్తుతం అనిల్ సినిమా కోసం స్టార్ ప్రొడ్యూసర్లు క్యూ కడుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు కూడా అనిల్ తో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో అనిల్ రావిపూడి.. వెంకటేష్‌తో ఓ సినిమా తెర‌కెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వెంకటేష్ కెరీర్‌లో 76వ‌ సినిమాకు ఈ సినిమా రూపొందనుంది. వెంకటేష్, అనిల్ చేస్తున్నా ఈ సినిమా టైటిల్స్ ఇంకా ఫిక్స్ చేయలేదు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ఇందులో హీరోయిన్లుగా కనిపించనున్నారు. దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమా 2025 సంక్రాంతి బరిలో రిలీజ్ కానుంది. ఇక వెంకటేష్, అనిల్ కాంబోలో ఇది మూడో సినిమాగా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే.

అనిల్ రావిపూడి... సరిలేరు స్టైల్ లోనే | Anil Ravipudi is planning to  complete Venky76 within 5 months

దీంతో ఈ కాంబినేషన్ ఈసారి కూడా బ్లాక్ బస్టర్ అవడం ఖాయం అంటూ అభిమానులు నమ్మకంతో ఉన్నారు. ఈ క్రమంలో అనిల్ రావిపూడికి సంబంధించిన ఓ న్యూస్ వైర‌ల్ అవుతుంది. స్టార్ డైరెక్ట‌ర్గా దూసుకుపోతున్న క్రమంలో.. ఇప్పటికే తన రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచేసాడట. ఇంతకీ అనిల్ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలిస్తే నోరెళ్‌ళ‌బెడతారు. దాదాపు రూ.25 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అయిన ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం అనిల్ సినిమాకు మంచి మార్కెట్ ఉండడం.. ప్రేక్షకులు ఆయన సినిమాలకు బ్రహ్మరథం పట్టడంతో.. నిర్మాతలు కూడా అనిల్ రావిపూడి అడిగినంత ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. గతంలో రెండు మూడు కోట్ల నుండి.. ఒకసారిగా మహేష్ సినిమా సక్సెస్ తో రూ.15 కోట్లకు పెంచేసిన రెమ్యునరేషన్.. మహేష్ సినిమా సక్సెస్ తర్వాత వరుసగా హిట్లు పడడంతో మరింతగా రేట్లు పెంచుకుంటూ ప్రస్తుతం రూ.25 కోట్లకు రెమ్యునరేషన్ చేర్చుకున్నట్లు తెలుస్తోంది.