ఖడ్గం మూవీ సంగీత రోల్ మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. ?

టాలీవుడ్ ఆడియన్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయే మూవీ ఖడ్గం. స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవ సందర్భంగా బుల్లితెరపై కచ్చితంగా ఈ సినిమాను ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తూనే ఉంటారు. ఆడియన్స్ కూడా బుల్లితెరకు అతుక్కుపోయి మరి ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా అప్పట్‌లో తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది. నవంబర్ 29, 2002లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుంది. అప్పట్లో ధియేటర్ల కలెక్షన్స్ సునామి సృష్టించడమే కాదు.. ప్రొడ్యూసర్లకు లాభాల వర్షం కురిపించింది. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా శ్రీకాంత్ నటించగా.. హీరోగా అవకాశాల కోసం ప్రయత్నించే కుర్రాడిగా రవితేజ మెప్పించాడు. ముస్లిం వ్యక్తిగా ప్రకాష్ రాజ్ తన అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కంటెంట్ పరంగా, మ్యూజిక్ పరంగాను విపరీతంగా ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈ సినిమా.. అప్పట్లో ఇండస్ట్రియల్ హిట్‌గా నిలిచింది.

ఇప్పటికీ.. ఈ సినిమాలో సాంగ్స్ ఎవర్ గ్రీన్. ఇందులో హీరోయిన్ సంగీత పాత్ర గురించి అసలు చెప్పనవసరం లేదు. ఎప్పటికీ సంగీత పేరు తలుచుకుంటే వెంటనే ఈ సినిమాలో సంగీత పాత్రే గుర్తుకు వస్తూంది. హీరోయిన్ కావాలని పల్లెటూరు నుంచి ఎన్నో ఆశలతో వచ్చి అమాయకత్వంతో కనిపించే అమ్మాయిగా పాత్రలో నటించి మెప్పించింది సంగీత. ఈ సినిమాలో సంగీత క్యారెక్టర్, డ్రెస్సింగ్ అప్పట్లో తెగ ట్రెండింగ్ గా ఉన్నాయి. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ రవితేజ సంగీత మధ్య వచ్చే సన్నివేశాలు విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇందులో సంగీతతో పాటు.. సోనాలి బింద్రే, కిమ్ శర్మ, పూజ భారతి ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఈ సూపర్ హిట్ సినిమాలో సంగీత పాత్రలో నటించే మంచి ఛాన్స్ ను మిస్ అయింది ఓ స్టార్‌ బ్యూటీ. ఇంతకీ అలాంటి సంగీత పాత్రను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరు.. ఒకసారి తెలుసుకుందాం. మొదట సంగీత పాత్రలో మరో హీరోయిన్‌ను భావించాడట డైరెక్టర్.

ఆమె మరెవరో కాదు సాక్షి శివానంద్. ఇదే విషయంపై ఆమెను అప్రోచ్ కాగా.. ఆమె చేయనని రిజ‌క్ట్ చెసేసిందట. దీంతో ఆమె స్థానంలో సంగీతను అప్రోచ్ అయి.. ఆమెను ఫిక్స్ చేశారు. ఇందులో అమాయకమైన పాత్రలో సంగీత అద్భుత నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత మంచి ఇమేజ్ క్రియేట్ అవ్వడమే కాదు.. స్టార్ హీరోయిన్గా చాలా సంవత్సరాలు వరుస ఆఫర్లను అందుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ముద్దుగుమ్మ ఇటీవల కాలంలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ప్రస్తుతం యంగ్ హీరోలకు తల్లిగా, వదినగా నటిస్తూ మెప్పిస్తుంది. తాజాగా మహేష్ సర్కారు వారి పాట సినిమాలో రష్మిక తల్లిగా మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ న్యూస్‌ చేసిన వైరల్ అవ్వడంతో.. సాక్షి శివానంద్ కాదు కదా.. ఆ పాత్రలో మరెవరు నటించిన సంగీతా అంత నేచురాలిటీ వచ్చేది కాదు. సంగీత అయితేనే ఈ పాత్రకు కరెక్ట్ గా సెట్ అయింది అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజ‌న్స్‌.