స్టార్ బ్యూటీ మనిషి చిల్లరకు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ 2017లో మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. యావత్ దేశం గర్వించేలా చేసిన ఈ అమ్మడు.. మోడలింగ్ రంగంలో తనదైన ముద్ర వేసుకుంది. 2022లో సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టి.. మొదట అక్షయ్ కుమార్ తో.. సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాలో నటించింది. ఈ మూవీలో పృధ్వీరాజ్ చక్రవర్తి పాత్రలో అక్షయ్ కుమార్ నటించగా.. మనిషి చిల్లర సంయోగిత పాత్రలో ఆకట్టుకుంది. ఇక 27 ఏళ్ల వయసు ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాలో 50 ఏళ్లు పైబడిన నటుడు అక్షయ్ కుమార్ తో రొమాన్స్ చస్తూ కనిపించింది.
అయితే ఈ మూవీలో నటించిన మొదటి సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా పరిస్థితి మరీ దారుణంగా ఉండడంతో.. ఖర్చు భరించడం కూడా కష్టంగా మారిన పరిస్థితి. అయితే సామ్రాట్ పృథ్వీరాజ్ వసూళ్లపరంగా డిజాస్టర్‌గా నిలవడంతోపాటు.. మనుషి నటనకు కూడా విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. 2022లో ప్లాప్ సినిమా తర్వాత ఇటీవల రిలీజైన ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలో మరోసారి మానుషి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే వరుణ్ తేజ్ తో కలిసి నటించిన ఈ సినిమాలో వింగ్ కమాండర్ గా మానుషి కనిపించింది. ప్రేక్షకులు ఈ సినిమాను కూడా పూర్తిగా రిజెక్ట్ చేసేసారు. ఆ తర్వాత ఇటీవల ఆమె అక్షయ్ కుమార్.. టైగర్ షఫ్ సినిమాలోను.. బడే మీయా.. చోటే మియా సినిమాల్లోనూ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పరజయాన్ని దక్కించుకుంది.
దీంతో ఇప్పటివరకు మనిషి చిల్లర నటించిన సినిమాలన్నీ ఫ్లాప్‌గానే మిగిలాయి. ఇక మనిషి మోడల్ కాక ముందు తన మెడిసిన్ పూర్తిచేసుకుంది. ఆమె తన కుటుంబం యొక్క కలలను నెరవేర్చేందుకు డాక్టర్ కావాలని ఫిక్స్ అయింది. కానీ.. విధి ఆమెను చాలా మలుపులు తిప్పింది. ఈ క్రమంలో మోడల్ గా మారిన మానుషి.. కళాశాల నుంచి మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఫెమినా మిస్ ఇండియా.. హర్యానాగా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని.. తర్వాత ఫెమినా మిస్ ఇండియా టైటిల్‌ను సంపాదించుకున్న మానుషి ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకుంది. ఈ క్రమంలో 2017లో భారతదేశానికి మిస్ వరల్డ్ కిరీటం కూడా దక్కించుకొని మిస్ వరల్డ్ బ్యూటీగా మారిపోయింది.