టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఎంతో మంది హీరోయిన్లుగా అడుగుపెట్టి స్టార్ హీరోయిన్‌లు రాణించిన వారు ఉన్నారు. అలాగే కొంతమంది అవకాశాలు లేకపోవడంతో వెనుతిరిగి వేరే మార్గాలను ఎంచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన వారిలో సంయుక్త మీనన్ కూడా ఒకటి. 2016లో మలయాళం మూవీ కార్న్ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సంయుక్త.. తర్వాత తమిళ్లో కొన్ని సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఈ కేరళ కుట్టి 2002లో రిలీజ్ అయిన బీమ్లా నాయక్ తో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ సినిమాతో సంయుక్తకు మంచి ఇమేజ్ క్రియేట్ అయింది. అమ్మడి నటనకు ప్రశంసలు దక్కాయి.
దీంతో తర్వాత కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాలో హీరోయిన్గా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇక తర్వాత ధనుష్ సరసన సార్ సినిమాలో నటించి ఆకట్టుకుంది. అలాగే సాయిధరమ్ తేజ్‌తో విరూపాక్ష సినిమాలో నటించి తన నట విశ్వరూపాన్ని చూపించడమే కాదు.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలా గత కొంతకాలంగా అమ్మడు నటించిన అన్ని సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాయి. ఇక ప్రస్తుతం సంయుక్త.. నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ స్వయంభులో హీరోయిన్గా నటిస్తుంది. దీంతోపాటే అమ్మడి చేతిలో మరో నాలుగైదు సినిమాలు ఉండనే ఉన్నాయి.
ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాయి ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు చేరువవుతుంది. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు నెటింట షేర్ చేసుకుంటూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే సంయుక్తకు సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం తెగ వైరల్‌గా మారుతుంది. ఓ తమిళ్ నటుడుతో సంయుక్త లవ్ ఎఫైర్ కొనసాగిస్తుందని.. వార్త వైరల్ గా మారింది. వీరిద్దరు ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ ఇండస్ట్రీ వర్గాల్లో విపరీతమైన చర్చలు నడుస్తున్నాయి. ఇక ఈ నటుడు ఎవరు.. ఏంటి.. అనే వివరాలు మాత్రం బయటకు రాలేదు. ఇందులో ఎంతవరకు నిజమందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వార్త తెగ వైరల్ గా మారుతుంది.