ఎన్టీఆర్ పేరుతో నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు.. గందరగోళంలో ఫ్యాన్స్..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఉన్న ఫేమ్‌, ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా నందమూరి కుటుంబం నుంచి ఇద్దరు ఎన్టీఆర్లు ఉన్నారు. నాలుగో తరం హీరోగా మరో ఎన్టీఆర్‌ను వైవిఎస్ చౌదరి త్వరలోనే పరిచయం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరు ఎన్టీఆర్‌ల‌ సినిమా అప్డేట్స్ ఒకే రోజున శుక్రవారం రిలీజ్ చేయడం ప్రేక్షకుల్లో ఆనందాన్ని.. అదే సమయంలో కన్ఫ్యూజన్ ని కూడా క్రియేట్ చేశాయి. అందులో ఒకరు జూనియర్ ఎన్టీఆర్.. యంగ్ టైగర్. కాగా మరో ఎన్టీఆర్ హరికృష్ణ పెద్ద కుమారుడు.. జానకిరామ్ తనయుడు నందమూరి తారక రామారావు కావడం విశేషం. నందమూరి వారసులుగా వీరిద్దరూ ఒకే పేరుతో సినిమాలు చేస్తే.. ఇకపై ఫ్యాన్స్ లో, అలాగే సాధారణ ప్రేక్షకులను కన్ఫ్యూజన్ మొదలవుతుందనటంలో సందేహం లేదు. ముందు.. ముందు.. ఏమోగానీ నిన్న వ‌చ్చిన‌ ఇద్దరు ఎన్టీఆర్ సినిమాల అప్డేట్స్‌తో ఫ్యాన్స్ లో కాస్త గందరగోళం మొదలైపోయింది.

కేజీయ‌ఫ్, స‌ల్లర్‌ సిరీస్ లతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లో అందుకొని స్టార్ట్ డైరెక్టర్ ఇమేజ్ ద‌క్కించుకున్న ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో యంగ్ టైగర్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. నిన్న శుక్రవారం పంచమి కావడంతో.. ఈ సినిమా పూజా కార్యక్రమాలను ప్రారంభించారు టీం. ఇక మైత్రి మూవీ మేకర్స్ సినిమాను భారీ బడ్జెట్‌లో తెర‌కెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే రోజు చాలా సినిమాలను మొదలుపెట్టారు. అయితే మరోవైపు.. నందమూరి హరికృష్ణ మనవడు.. జానకిరామ్ కుమారుడైన ఎన్టీఆర్.. అరంగేట్రానికి సంబంధించిన ప్రకటన చేసేందుకు డైరెక్టర్ కూడా మీడియా సమావేశాన్ని ఏర్పరిచి అందరికీ ఆశ్చర్యాన్ని కల్పించాడు. చాలా గ్యాప్ తో వైవిఆర్ చౌదరి మరోసారి డైరెక్టర్ గా నందమూరి నాలుగో తరం హీరోని పరిచయం చేయబోతున్నాడు. ఇప్పటికే హరికృష్ణతో పలు సినిమాలను తెరకెక్కించే సక్సెస్ అందుకున్న వైవిఎస్.. నందమూరి ఫ్యామిలీ ని కూడా తన ఫ్యామిలీ గా ఫీల్ అవుతుంటారు. ఈ క్ర‌మంలో మరోసారి హరికృష్ణ మనవ‌డిని ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నాడు వైవియ‌స్‌.

ఈ సినిమాకు సంబంధించిన వివరాలు.. అలాగే నందమూరి నాలుగో తరం ఎన్టీఆర్‌ను పరిచయం చేసేందుకు మీడియా సమావేశాలను ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఇలా ఒకేరోజు ఒకే కుటుంబానికి చెందిన, ఒకే పేరు గల ఇద్ద‌రు హీరోల సినిమాలు అప‌డేట్స్ రావడంతో టాలీవుడ్‌లో ప్రాధాన్యత సంచరించుకుంది. అయితే మొదట జూనియర్ ఎన్టీఆర్ పేరు తారక్‌గానే ఉండేదని.. నటుడుగా ఎంట్రీ ఇచ్చేముందు తాత ఎన్న‌టీఆర్ ఆయ‌న పేరును స్వయంగా తారక్‌కు పెట్టారని సమాచారం. ఇక హరికృష్ణ మనవ‌డు.. జానకిరామ్ కుమారుడు పుట్టినప్పటినుంచి నందమూరి తారకరామారావు గా పేరు పెట్టారు. సదరు కుటుంబ సభ్యులుగా.. ఇద్దరు హీరోలకు ఎన్టీఆర్ పేరు పెట్టుకునే హక్కు ఉంది. ఈ క్రమంలో వీరిద్దరి పేర్లతో అభిమానులకు గందరగోళం ఏర్పడకుండా.. వీరి పేర్ల విషయంలో ఇద్దరు వారసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.