హీరోయిన్ శోభిత ధూళిపాళ్ళ.. నిన్న మొన్నటి వరకు ఈ అమ్మడి పేరు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే అక్కినేని నాగచైతన్యను ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో అక్కినేని ఇంటికి కాబోయే కోడలుగా.. ఒక్కసారిగా స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే తన నటనతో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. కాగా శోభిత నటనపై ఇంట్రెస్ట్ మొదట మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి.. తర్వత ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇలా తన కెరీర్‌లో శోభిత ఎన్నో అవార్డులను దక్కించుకుంది. ఇక ఇప్పటివరకు ఈ అమ్మడు కైవసం చేసుకున్న అవార్డుల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం.
ఈ అమ్మడు మొదట 2019లో గ్రాజియా మిలియన్ అవార్డ్స్ వారిచే బ్యాక్ థ్రు పర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును దక్కించుకుంది. తర్వాత అదే ఏడాది జీక్యూ ఇండియా అవార్డ్, ఎమర్జింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ లను కూడా దక్కించుకుంది. ఇక 2022లో లైన్స్ గోల్డ్ అవార్డ్స్ వేడుకల్లో మౌల్డ్ బ్రేకర్ ఆఫ్ ది ఇయర్ గా అవార్డును చేజకించుకొని.. మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక మరోసారి ఇదే ఏడాదిలో ఎల్లే స్టైలిష్ అవార్డులో వేడుకల్లో జెన్ Z స్టైల్ ఐకాన్ అవార్డును దక్కించుకుంది. ఇక 2023లో ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌తో అమ్మడికి ఎంతోమంది ప్రశంసలు దక్కడమేకాదు.. ఉత్తమ నటిగా ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డ్స్ వేదికపై పాపులర్ ఓటిటి ఫ్లాట్‌ఫాం అవార్డ్ దక్కింది.
ఇక 2023లోను బాలీవుడ్ హంగామా.. ఇండియా ఎంటర్టైన్మెంట్స్ అవార్డ్‌తో గేమ్ చేంజర్ ఆఫ్ ది ఇయర్ బెస్ట్ యాక్టర్‌గా మరోసారి అవార్డును దక్కించుకుంది. ఇక గతేడాదిలో ఏకంగా నాలుగు అవార్డులను దక్కించుకుంది. ఓగ్ ఫోర్స్ ఆఫ్ ఫ్యాషన్, గ్రాజియా.. ట్రెండ్ సెంటర్ ఆఫ్ ద ఇయర్, మిడిల్ షోబీజ్.. స్టైలిష్ ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను కైవసం చేసుకుంది. ఇక ఈ ఏడాదిలో మరోసారి గ్రాజియా అవార్డుల వేడుకలు ట్రేల్ బ్లేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడ దక్కించుకుంది. ప్రస్తుతం శిభిత అవార్డుల లిస్టును చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. వామ్మో.. నాగార్జున కొత్త కోడలు కూడా మంచి టాలెంటెడ్ లేడీనే అంటూ.. ఏకంగా ఇన్ని అవార్డులను దక్కించుకుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.