టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో వైవిఎస్ చౌదరి కూడా ఒకరు. నందమూరి ఆస్థాన డైరెక్టర్ గా ఇప్పటికే పలువురు నందమూరి హీరోలతో సినిమాలు తెరకెక్కించి వారికి మంచి సక్సెస్‌లు అందించిన వైవిఎస్.. ప్రస్తుతం నందమూరి కుటుంబం నుంచే నాలుగో తరం వారసుడైన మరో ఎన్టీఆర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా సినిమా అప్డేట్స్ మీడియాతో షేర్ చేసుకున్న వైవియస్ చౌదరి ఇందులో భాగంగానే.. ఎన్టీఆర్ తో ఇప్పటివరకు సినిమా చేయకపోవడానికి గల కారణాన్ని కూడా వివరించారు.
ఈ ప్రెస్ మీట్ లో జర్నలిస్ట్ మాట్లాడుతూ.. హరికృష్ణ గారితో, బాలకృష్ణ గారితో సినిమాలు చేశారు. ఇప్పుడు నాలుగో తరం హీరో ఎన్టీఆర్ తో కూడా సినిమా తెరకెక్కిస్తున్నారు. అయితే మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ తో మాత్రమే సినిమా చేయకపోవడానికి కారణమేంటి అని ప్రశ్నించగా.. దానిపై వైవిఎస్ చౌదరి రియాక్ట్ అవుతూ.. నేను సినిమాలను చేయడమే చాలా తక్కువగా ఉంటుంది. ఏడాదికో రెండు సంవత్సరాలకో ఒక సినిమాను తెరకెక్కిస్తాను. మొదట నేను కథను రాసుకున్న తర్వాత హీరోను సెలెక్ట్ చేసుకుంటా. నేను రాసుకున్న కథలకు అప్పట్లో హరికృష్ణ, బాలకృష్ణ గారు సెట్ అవుతారు అనిపించింది. వారిని అప్రోచ్ అయ్యా.
అదే సమయంలో ఇంకా స్టార్‌డంను సంపాదించుకునే స్టార్ హీరోలుగా ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. అయినా నేను వారిని అప్రోచ్ కాను. ఎందుకంటే నేను రాసుకున్న కథకు తగ్గట్టుగానే హీరోను సెలెక్ట్ చేసుకుంటా. ఈ క్రమంలో మీకు మరో సందేహం రావచ్చు. అయితే మీ కథలతో ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లాలని ఎప్పుడు అనిపించలేదా అని.. అయితే ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళకూడదనేది నా ఉద్దేశం కాదు.. ఇప్పటివరకు నేను రాసుకున్న కథ ఏది ఎన్టీఆర్కు సెట్ కాలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా వైవిఎస్ చౌదరి ఇప్పటివరకు ఎన్టీఆర్ తో సినిమా చేయకపోవడానికి కారణం నేను రాసిన కథలు తారక్‌కు సెట్ కాకపోవడమే అంటూ చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారాయి.