!నాగచైతన్య సమంత విడాకుల తర్వాత మరోసారి వివాహం చేసుకోవడానికి చైతు సిద్దమైన సంగతి తెలిసిందే. తెలుగు నటి శోభిత ధూళిపాళ్లని చైతు ఇటీవల సింపుల్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇరు కుటుంబాల సమక్షంలో వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. త్వరలోనే వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ విషయం వైరల్ అవ్వడంతో అక్కినేని కుటుంబంలోకి కొత్త కోడలు ఎంట్రీ ఇస్తుందంటూ న్యూస్ నెటింట హార్ట్ టాపిక్‌గా మారింది. అసలు ఈ శోభిత ఎవరు.. నాగచైతన్యకు ఎలా పరిచయం.. వీళ్లిద్దరి లవ్ స్టోరీ ఏంటి.. ఇలా ఎన్నో అంశాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది.
ఈ క్రమంలో ఎంగేజ్మెంట్ అయిన మొట్టమొదటిసారి శోభిత తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ని షేర్ చేసుకుంది. నాగచైతన్య పై ఎమోషనల్ గా తన ప్రేమను వర్ణించింది. కవిత్వంలో లైన్స్ పోస్ట్ చేస్తూ చైతుపై ఎంత ప్రేమ ఉందో బయటపెట్టింది. నా తల్లి మీకు ఏమైనా కావచ్చు.. ఇదేమైనా.. మా తండ్రి మీకు ఎలా బంధువు..? మీరు, నేను ఎప్పుడు కలిసినా.. ఎలా కలిసినా.. మన హృదయాల్లో మాత్రం ప్రేమ ఉంది. మన మనసులు ఎర్రటి భూమిలా మారి.. వర్షపు జల్లులో తడుస్తున్నాయి.
విడిపోవడానికి మించి మనం కలిసిపోయాం అంటూ ఎమోషనల్ గా కవిత్వాన్ని పోస్ట్ చేసింది. శోభిత నిశ్చితార్థం తర్వాత చైతుతో రొమాంటిక్ షేర్ చేస్తూ ప్రస్తుతం చేసిన కవిత నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోలో వీరిద్దరు ఎంత చూడముచ్చటగా ఉన్నారు. కాగా ప్రస్తుతం శోభిత చేసిన పోస్ట్ నెటింట వైరల్ అవ్వడంతో.. నిన్న వేణు స్వామి ఈ జంట విడిపోతారు అంటూ చేసినా కామెంట్స్ పై ఇన్ డైరెక్ట్ గా శోభిత బ్టాస్టింగ్ సమాధానం ఇచ్చిందంటూ.. విడిపోవడానికి మించి మనం కలిసిపోయాం అంటూ క్లారిటీ ఇచ్చిందని.. అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.