సమంత పెళ్ళిలో శోభిత.. పిక్స్ వైరల్..!

నాగచైతన్య తాజాగా ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ సడన్ షాక్ ఇచ్చాడు. అప్పటినుంచి శోభిత ధూళిపాల. నాగచైతన్య డేటింగ్‌లో ఉన్నారంటూ వస్తున్న వార్తలను నిజం చేస్తూ.. ఆగస్టు 8న ఉదయం వీరిద్దరూ సింపుల్గా ఎంగేజ్మెంట్‌తో ఒకటయ్యారు. ఈ క్రమంలో చైతన్య, శోభిత ఎప్పుడెప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతారని ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే వీరి పెళ్లి ముహూర్తం ఎప్పుడు అనే విష‌యం మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఇలాంటి హ్యాపీయస్ట్ మూమెంట్లో సమంత మ్యారేజ్ లో శోభిత సందడి చేసింది అంటూ ఓ వార్తను వైరల్ గా మారుతుం

అంతేకాదు ఆ ఫోటో కూడా ఇప్పుడు నెటింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. అసలు సమంత పెళ్ళిలో శోభిత ఉండడం ఏంటి.. సమంత, నాగచైతన్య పెళ్లి సమయానికి శోభితకు వారితో అసలు సంబంధం లేదు కదా.. అనే సందేహాలు ప్రేక్షకుల్లో ఇప్పటికే మొదలైపోయి ఉంటాయి. ఇక్కడ అసలు ట్విస్ట్ ఇదే. సమంత అంటే నాగచైతన్య మొదటి భార్య స్టార్ హీరోయిన్ సమంత కాదు. ఆమె శోభిత ధూళిపాళ్ల చెల్లెలు సమంత. ఇక శోభిత.. చెల్లెలు సమంతకు గతంలోనే మ్యారేజ్ అయిపోయింది. ఢిల్లీకి చెందిన ఫిజీషియన్ సోహెల్ ను సమంత వివాహం చేసుకుంది. అయితే ప్రస్తుతం ఈ పిక్స్ ను నెటింట వైరల్ చేస్తూ సమంత పెళ్లిలో శోభిత సందడి చేస్తుందంటూ ట్రెండ్‌ చేస్తున్నారు ఆకతాయిలు. వాస్తవంగా నాగచైతన్య మొదటి భార్య పేరు కూడా సమంత కావడంతో.. నాగచైతన్య, సమంత పెళ్లిలో శోభిత కనిపించిందేమో అంటూ అంత బ్రహ్మ పడ్డారు.

ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవడంతో,, మరికొంతమంది శుభమంటూ నాగచైతన్య శోభితను వివాహం చేసుకోవాలనుకుంటే.. ఆమె సిస్టర్ సమంత పెళ్ళి ఫోటోలను వైరల్ చేస్తూ మొదటి భార్య సమంతను.. నాగచైతన్యకు ఎందుకు గుర్తు చేస్తున్నారు. మనస్పర్ధలు రావడంతో కలిసి జీవించలేమని వారు డిసైడ్ విడిపోయి హ్యాపీగా ఉంటున్నారు. ఇలాంటి క్రమంలో చేతు పెళ్లిలో మరోసారి మాజీ భార్య సమంతను గుర్తు చేయడం సమంజసం కాదు.. అంటూ పలువురు కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సమంత పేరును అడ్డుపెట్టుకుని శోభిత సోదరి పెళ్లి ఫోటోలు వైరల్ చేయ‌డంపై ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట‌ హాట్ టాపిక్‌గా మారింది.