నందమూరి కుటుంబంలో హీరోలకు.. మెగా కుటుంబంలో హీరోలకు మధ్యన చాలా వ్యత్యాసం ఉంటుంది. మెగా కుటుంబంలో హీరోలంతా.. అల్లు అర్జున్ తప్పిస్తే మిగతా వారు ఒకరితో ఒకరు ఎంతో ప్రేమగా, ఆప్యాయతగా ఉంటారు. అయితే నందమూరి కుటుంబంలో హీరోలు మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తారు. నందమూరి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీ లోకి ఎంతో మంది హీరోలుగా అడుగుపెట్టిన.. ప్రస్తుతం బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రమే హీరోలుగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఈ నందమూరి కుటుంబంలో హీరోలంతా ఎంతో సఖ్యతగా కలిసిమెలిసి ఉండేవారు. కానీ.. అది మూడు నాళ్ళ ముచ్చటగా మారిపోయింది. ఎంతో కాలం నుంచి వీరి మధ్యన సఖ్యత లేదన్న సంగతి తెలిసిందే. అయితే నందమూరి హరికృష్ణ మరణంతో బాలయ్యకు.. తారక్, కళ్యాణ్ రామ్ మధ్యన దూరం ఒక్కసారిగా పెరిగిపోయింది.
ఇక కళ్యాణ్ రామ్ గత సినిమా డెవిల్ ద్వారా అభిషేక్ నామా డైరెక్టర్గా ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా డైరెక్టర్ వేరు అయితే.. 80% షూటింగ్ పూర్తయిన తర్వాత నిర్మాత అభిషేక్ నామతో, కళ్యాణ్ రామ్ తో.. డైరెక్టర్ కు విభేదాలు రావడంతో ఆయన పేరుకు బదులుగా దర్శకుడుగా అభిషేక్ నామ పేరు డిస్ప్లే చేసుకున్నారు మేకర్స్. ఇక డెవిల్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు బాలయ్యను ముఖ్యఅతిథిగా పిలుద్దామని అభిషేక్ నామ కళ్యాణ్ రామ్‌తో అన్నారట. ఈ విషయం విన్న కళ్యాణ్ రామ్.. అతనిపై ఫైర్ అయ్యారని.. ప్రస్తుతం బాబాయ్ ని పిలవాల్సిన పనిలేదు. పిలిచినా రాడు. అతన్ని పిలవాలని ఆలోచన మానుకోండి అంటూ చెప్పేశాడట. అప్పట్లో ఈ న్యూస్ తెగ వైరల్ గా మారింది. ఇదే వార్త.. బాలయ్య 50 ఏళ్ల సినీ వేడుకలకు తారక్ కళ్యాణ్‌రామ్ హాజరవుతారా.. లేదా.. అనే అంశంపై మరోసారి వైరల్ గా మారుతుంది.
ఇక ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల్లో బాలయ్య నటించిన సమయంలో వీరి మధ్యన సత్సంబందలు బాగానే ఉన్నా.. కాలం గడుస్తున్న కొద్ది విభేదాలు పెరిగి పెద్ద గొడవలుగా మారిపోయాయి. వాటికి తోడు చంద్రబాబును అరెస్ట్ చేసిన టైంలో తారక్, కళ్యాణ్‌రామ్ ఇద్దరు స్పందించకపోవడం.. ఇతర కుటుంబ సభ్యులు కూడా ఈ వివాదాలకు దూరంగా ఉన్నారు. దీంతో నందమూరి ఫ్యామిలీ మధ్యన గొడవలు ఇంకా తీరలేదు అంటూ.. వీరి వివాదాలు పెరుగుతున్నాయి అంటూ.. వార్తలు తెగ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇక బాలయ్య 50 ఏళ్ళ సినీ వేడుక త్వరలోనే గ్రాండ్ లెవెల్లో జరగనుంది. అయితే ఈ వేడుకకు కూడా వీరు హాజరయ్యే అవకాశాలు లేవని కామెంట్‌లు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం వీరి మధ్యన ఉన్న తీవ్రస్థాయి విభేదాలతో భవిష్యత్తులో కూడా వీరు కలవడం కష్టమే అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.