సాధారణంగా హిందూ వివాహ వ్యవస్థలో పెళ్లి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇక భార్యాభర్తల మధ్యలో ఉండాల్సిన ఏజ్ గ్యాప్ విషయంలోనూ చాలా స్పష్టంగా వ్యవహరిస్తూ ఉంటారు. భర్త కంటే భార్య చిన్నదిగా ఉండేలా వివాహాలను ఫిక్స్ చేస్తూ ఉంటారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌గా రాణిస్తున్న మహేష్ బాబు భార్య నమ్రత మాత్రం.. మహేష్ కంటే వయస్సులో పెద్దదన్న సంగతి తెలిసేఉంటుంది. కానీ.. వీరిద్దరి మధ్యన ఏజ్ గ్యాప్ ఎంత అనే ఆన్సర్ మాత్రం చాలా మందికి తెలియదు. ఇక మహేష్ కెరీర్ బిగినింగ్ లోనే నమ్రతతో ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తన మూడో సినిమా వంశీ సినిమాలో నమ్రత, మహేష్ జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు బి. గోపాల్ దర్శకత్వం వహించాడు.
2002లో రిలీజ్ అయిన ఈ సినిమా ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు. అయినప్పటికీ సినిమా షూట్ టైంలో మాత్రం వీరిద్దరి మధ్యన మంచి స్నేహం ఏర్పడడం.. అది కాస్త ప్రేమగా మరింది. అయితే వీరి ప్రేమను మరికొద్ది కాలం కంటిన్యూ చేసి.. ఇద్దరి మధ్యన లోతైన అవగాహన కుదిరితేనే ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నాకే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట. కారణం ఇద్దరి నేపథ్యాలు పూర్తిగా వేరు కావడమే. ఇలా నాలుగేళ్లకు పైగా రిలేషన్ షిప్‌లో ఉన్న నమ్రత, మహేష్ తర్వాత వివాహం చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట. మహేష్ లవ్ మ్యాటర్ అక్క మంజులకు తెలియడంతో.. నమ్రత, మహేష్.. మంజులను తరచుగా కలుస్తూ ఉండేవారట. అయితే నమ్రతతో వివాహానికి కృష్ణ మొదట ఒప్పుకోలేదు. మంజుల తండ్రి కృష్ణను ఒప్పించి.. మహేష్, నమ్రతల వివాహం జరగడంలో కీలక పాత్ర పోషించారు. అలా నమ్రత, మహేష్ 2005 లో వివాహం చేసుకున్నారు.
వీరి పెళ్లి చాలా సింపుల్ గా జరిగింది. మీడియాకు కూడా సమాచారం లేకపోవడం విశేషం. మహేష్ పెళ్లి తర్వాత అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే మహేష్ కంటే నమ్రత వయసులో చాలా పెద్దది కావడం.. 1975 ఆగస్టు 9న పుట్టిన మహేష్.. ప్రస్తుత వయసు 49 ఏళ్లు. ఇక నమ్రత 1972 జనవరి 22న జన్మించారు. ఈ క్రమంలో నమ్రత.. భర్త మహేష్ కంటే మూడు సంవత్సరాల ఆరు నెలలు పెద్దదంటూ వార్తలు నెటింట వైరల్‌గా మారుతుంది. వివాహం తర్వాత నమ్రత యాక్టింగ్ గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. మహేష్ దంపతులకు గౌతమ్, సితార ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేవరకు నమ్రత వారి బాధ్యతలను చూసుకుంటూనే మహేష్ బాబు వ్యాపారాలను చూసుకుంది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు సలహాదారుడిగా బిజినెస్ ఉమెన్‌గా రాణిస్తున్న నమ్రత.. మహేష్ సక్సస్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. టాలీవుడ్ బెస్ట్ కపుల్‌గా ఈ జంట ఎంతో మంది అభిమానాన్ని దక్కించుకుంటున్నారు.