42 ఏళ్ళ వయసులోనూ ఫన్నీ ఫిట్నెస్ సీక్రెట్ అదే.. రోజు అలా చేస్తాడా..?

సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ సెలబ్రెటీల్లుగా మారిన తర్వాత ప్రతి నటి,న‌టుల‌కు ఎంతో కొంత ఫాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఈ క్రమంలో తమ ఫేవరెట్ సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో వీరికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా.. క్షణాల్లో ఆ వార్తలు నటింట ట్రెండ్ చేస్తూ ఉంటారు అభిమానులు. ఇందులో భాగంగానే వారి లగ్జరీ లైఫ్, వారు వేసుకునే దుస్తులు, హ్యాండ్ బ్యాగ్స్, చెప్పులు దగ్గర నుంచి వారి ఫిట్నెస్ సీక్రెట్ వరకు ప్రతి ఒక్కదానిపై అభిమానులు ఆసక్తి చూపుతుంటారు. ఇక స్టార్ హీరోలుగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వారైతే.. ఏజ్‌తో సంబంధం లేకుండా యంగ్‌ లుక్స్‌తో, ఫిట్నెస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు అన్న సంగతి తెలిసిందే.

అందుకే వారు హీరోలుగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటారు, అలా ఏజ్ పెరుగుతున్న యంగ్ లుక్ తోచ‌ ఫిట్నెస్‌తో ఆకట్టుకునే హీరోలలో అల్లు అర్జున్ మొదటి వరుసలో ఉంటారు. అంతెందుకు మొదట టాలీవుడ్‌కు సిక్స్ ప్యాక్ ట్రెండ్ పరిచయం చేసిన హీరో అల్లు అర్జున్ కావడం విశేషం. ఇక ఇప్పటికీ అల్లు అర్జున్ అదే ఫిట్నెస్.. అదే యంగ్ లుక్స్ తో యూత్ ను ఆకట్టుకుంటున్నాడు. అయితే తన 42 ఏళ్ళ వయసులను అల్లు అర్జున్ ఇంత ఫిట్‌గా ఉండడానికి అతని డైట్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సినీ కెరీర్ ప్రారంభించిన దగ్గర నుంచి బన్నీ ఒక్కరోజు కూడా తన జిమ్ టైమ్ ను మిస్ చేయలేదట. తన జిమ్ కోసమని ఓ పర్టికులర్ టైం పెట్టుకుంటారని.. ఆరు నూరైనా ఆ టైంలో జిమ్‌కు కేటాయించి తీరుతాడని తెలుస్తుంది.

ఇక‌ కచ్చితంగా ప్రతి రోజు 45 నిమిషాల థ్రెడ్ మిల్ వర్క్ ఉండనే ఉంటుందట. మిగతా సమయాన్ని వర్కౌట్లకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేస్తాడట. ఇక ప్రతిరోజు బన్నీ తన ఆహారంలో ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకుంటారట. బన్నీకి బాయిల్డ్ ఎగ్ అంటే చాలా ఇష్టమని సమాచారం. అలాగే అందరు సెలబ్రిటీల లాగా నోరు కట్టేసుకుని డైట్ ను ఫాలో అవ్వడం అల్లు అర్జున్‌కు ఇష్టం ఉండదట. ఈ క్రమంలో నాన్ వెజ్ అయినా తక్కువ ఆయిల్ తో తీసుకోవడానికి ఇష్టపడతాడనిటాక్‌. తనకు నచ్చిన ప్రతి ఆహారాన్ని లిమిట్ గా తీసుకుంటూ.. జిమ్ వర్కౌట్ల ద్వారా తన డైట్‌ను బ్యాలెన్స్ చేసేలా ప్లాన్ చేసుకుంటాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఎంతో శ్రమిస్తున్న బన్నీ.. ఈ సినిమాతో వేయికోట్ల గ్రాస్ వస్తుళ‌ను కొల్లగొట్టి రికార్డ్ సృష్టించాలనే ప్లాన్లో ఉన్నాడు. ఇక సినిమా రిలీజ్ అయి ఎలాంటి రిజ‌ల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.