టాలీవుడ్ లో డ్యూయల్ రోల్ లో ఎక్కువ సినిమాలు నటించినా హీరోల లిస్ట్ ఇదే..!

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వారందరికీ ఎంతో కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండనే ఉంటుంది. ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న స్టార్ హీరోలకు ఉండే అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే చాలు థియేటర్లో అభిమానుల హంగామా, విజిల్స్, గోలగోలగా ఉంటుంది.

అదే తమ అభిమాన హీరో డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నారంటే ఇంకా థియేటర్స్ బ్లాస్ట్ అవడం ఖాయం అనే రేంజ్ లో అభిమానులు రచ్చ లేపుతూ ఉంటారు. అలా ఒక సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తూ అత్యదిక సినిమాలు నటించిన హీరోలు ఎవరో ఒకసారి తెలుసుకుందాం. ఇప్పటివరకు తెలుగులో ఎక్కువగా డ్యూయల్ రోల్స్‌లో నటించిన హీరోగా నటసార్వ‌భౌమ.. నందమూరి తారక రామారావు గారు రికార్డ్ క్రియేట్ చేశారు. ఎప్ప‌టికి ఆ రికార్డ్ ఇంకెవరు బ్రేక్ చేయలేకపోయారు.

ఆయన తన కెరీర్‌లో ఏకంగా 35 సినిమాలకు పైగా డ్యూయల్ రోల్‌లో న‌టించారు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఈ రికార్డ్ సూప‌ర్ స్టార్‌ కృష్ణ సొంతం చేసుకున్నారు. ఆయన ఏకంగా 25 సినిమాలకు పైగా డ్యూయల్ రోల్‌లో న‌టించి ఫ్యాన్స్‌ను ఆక‌ట్టుకున్నాడు. ఇ్ ఆ తరువాత కూడా ఎంద‌రో హీరోస్ ఆ ట్రెండ్ కంటీన్యూ చేస్తున్నారు. బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ లాంటి హీరోలు కూడా డ్యూయల్ రోల్ చేసి మెప్పించారు.