ఓరి దేవుడోయ్: “సూసేటి అగ్గి రవ్వ” సాంగ్ అక్కడి నుంచి లేపేసాడా..? ఈ దేవి గాడు అడ్డంగా ఇరుక్కుపోయాడుగా..!

సోషల్ మీడియాలో హ్యూజ్ హ్యుజ్ ట్రోలింగ్ ఎక్కువగా చేస్తున్నారు ఆకతాయిలు . మరీ ముఖ్యంగా ఒక బడా పాన్ ఇండియా సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వచ్చినా పాట రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన కచ్చితంగా ఆ సినిమాకి సంబంధించిన డైరెక్టర్ ని లేదా..? మ్యూజిక్ డైరెక్టర్ని..? హీరోని ..? హీరోయిన్ ని మాత్రం గురి చేస్తూనే ఉంటారు . అలా చేస్తే వాళ్ళకి ఏమొస్తుందో ..? వాళ్లకే తెలియాలి .

 

రీసెంట్ గా సోషల్ మీడియాలో పుష్ప2లోని.. సూసేకి అగ్గి రవ్వ మాదిరి అనే సాంగ్ హ్యూజ్ ట్రోలింగ్ అవుతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప2 సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడానికి రెడీ అవుతున్నాడు . కాగా రీసెంట్ గా ఈ సినిమా నుంచి కపుల్ సాంగ్ రిలీజ్ చేశారు . సూసేకి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామి అంటూ సాగే లిరిక్స్ పాటకే హైలెట్గా మారాయి.

అయితే ఇక్కడ ఇప్పుడు దేవిశ్రీప్రసాద్ అడ్డంగా దొరికిపోయాడు .. ఈ పాట తెలంగాణ ఫోక్ సాంగ్ కి డిట్టో దింపేసినట్లు ఉన్నాడు అనే విధంగా ట్రోల్ చేస్తున్నారు జనాలు . దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది . సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ సాంగ్ కి సంబంధించిన ట్రోలింగే ఎక్కువగా కనిపిస్తుంది. చూద్దాం మరి దీనిపై పుష్ప 2 టీం ఎలా స్పందిస్తుందో..??