బాలయ్య “అంజలి-మందు” వివాదం.. విశ్వక్ సేన్ ఆ రకంగా కప్పి పుచ్చుతున్నాడా..?

ప్రజెంట్ సోషల్ మీడియాలో నందమూరి బాలయ్యకు సంబంధించిన ఒక వీడియో ఎలా ట్రోలింగ్కి గురవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. విశ్వక్సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు బాలయ్య . తనదైన స్టైల్ లో స్పీచ్ ఇచ్చి ఆకట్టుకోవడమే కాకుండా చాలా చమత్కారంగా బిహేవ్ చేశాడు . హీరోయిన్ అంజలిని నెట్టేస్తున్నట్లు కనిపించాడు . దీనికి సంబంధించిన వీడియో సోషల్ మాధ్యమంలో బాగా ట్రెండ్ అయింది .

అయితే కొంతమంది ఆడవాళ్లు ఈ వీడియో పై ఘాటుగా స్పందించారు . మరి కొంత మంది స్టార్స్ బాలయ్యను బూతులు తిడుతూ కామెంట్ పెట్టారు . అయితే తాజాగా దీనిపై హీరో విశ్వక్సేన్ అలాగే నిర్మాత నాగ వంశీ స్పందించారు . హీరో విశ్వక్సేన్ చెప్పుకొస్తూ ..”సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న వీడియో వేరు అక్కడ జరిగిన వీడియో వేరు ..ఎవరో కావాలనే బిట్స్ బిట్స్ గా క్రాప్ చేసి బాలయ్య సార్ ని ట్రోల్ చేస్తున్నారు. దయచేసి ఈ వెధవ పనులు ఆపండి “అనే విధంగా మెసేజ్ చేశాడు .

అదేవిధంగా నాగవంశీ సైతం రిప్లై ఇచ్చారు . “సోషల్ మీడియాలో బాలయ్య పై జరుగుతున్న ట్రోలింగ్ దారుణమని ..అక్కడ జరిగింది వేరు అని ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సరదాగా జరిగిన ఒక విషయాన్ని ఇంత రాద్ధాంతం చేయడం సరికాదు అని మండిపడ్డారు. అదే విధంగా బాలయ్య ఆ ఈవెంట్లో మందు తాగాడు అని వస్తున్న వార్తలపై కూడా స్పందించారు . అదంతా ఎవరో కావాలనే క్రియేట్ చేసిన గ్రాఫిక్ వర్క్ అంటూ కొట్టి పడేశారు “. కొంతమంది మాత్రం కావాలనే విశ్వక్సేన్ – నాగవంశీ.. బాలయ్యను సపోర్ట్ చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు . బాలయ్య తాగేసి అలా బిహేవ్ చేశాడు అంటూ బాలయ్య నే వేలెత్తి చూపిస్తున్నారు..!!