రాజమౌళికి-ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్.. ఫ్రెండ్ కోసం ఏం త్యాగం చేసావ్ బాసూ..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది. ప్రభాస్ తన ఫ్రెండ్ కోసం రాజమౌళికి స్పెషల్ రిక్వెస్ట్ చేశారా..? అంటే అవును అన్న మ్యాటర్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే ప్రెసెంట్ రాజమౌళి పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది . జక్కన్నగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి గ్లోబల్ వైడ్ గుర్తింపు సంపాదించుకున్నాడు .

అంతేకాదు ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడు . కాగా ప్రజెంట్ మహేష్ బాబుతో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు . ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి అంటూ తెలుస్తుంది . కాగా ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన కొన్ని కొన్ని డీటెయిల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతున్నాడు మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమాతన్ అనే వార్త హైలెట్గా మారింది .

దానికి కారణం కూడా ప్రభాస్ నే అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. సలార్ సినిమాలో ప్రభాస్ పృథ్వీరాజ్ సుకుమారన్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు . ఆ టైంలోనే బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారు . అయితే ఆ ఫ్రెండ్షిప్ ..ఆ చనువు కారణంగా ఇప్పుడు రాజమౌళి – మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో ఆయనకు కీలక పాత్ర ఇప్పించారట ప్రభాస్ . దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి..!!