సోషల్ మీడియాలో హ్యుజ్ ట్రోలింగ్ కి గురవుతున్న మహేష్ బాబు భార్య నమ్రత.. ఎందుకంటే..?

నమ్రత ..నమ్రత శిరోద్కర్.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఇండస్ట్రీని తన అంద చందాలతో ఎలా ఏలేసిందో ప్రత్యేకంగా చెప్పాలా..? ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సినిమాల్లో నటించి కుర్రాళ్లకు ఫేవరెట్ బ్యూటీగా మారిపోయింది . అప్పట్లో కుర్రాళ్ళు ఏ రేంజ్ లో ఊగిపోయేవారు మనకు బాగా తెలిసిందే. కాగా రీసెంట్గా నమ్రత శిరోద్కర్ ని సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురి చేస్తున్నారు కొందరు ఆకతాయిలు.

నమ్రత శిరోద్కర్ తన కూతురు జీవితాన్ని సోషల్ మీడియాలో పెట్టేసింది అంటూ మండిపడుతున్నారు. మహేష్ బాబు నమ్రతల ముద్దుల కూతురు సితార సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది . త్వరలోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుంది . అయితే కొంతమంది జనాలు మాత్రం సితార ఈ విధంగా సోషల్ మీడియాలో స్టార్ గా మారడం వెనక నమ్రత హస్తము ఉంది అంటూ నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు.

ఇంత చిన్న ఏజ్ లోనే ఆమెను సోషల్ మీడియా స్టార్ట్ చేయడం నమ్రత ముంబై తెలివితేటలు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఒక జువెలరీ యాడ్లో నటించినందుకు ఏకంగా కోటి రూపాయలు పారితోషకం తీసుకుంది సితార అంటూ వార్తలు వినిపించాయి . అంతేకాదు ఆ టైంలో మీడియా ఈవెంట్లో సితార ఆన్సర్స్ ఇవ్వడానికి చాలా చాలా ఇబ్బందికర పరిస్థితిని కూడా ఎదుర్కొంది అంటూ ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకు నమ్రుత సితారని అప్పుడే మీడియా ముందుకు తీసుకొస్తూ స్టార్ చేయాలి అనుకుంటుంది అని ..అది ఎడ్యుకేషన్ లైఫ్ కి ఆటంకం కలిగించవచ్చు అని మండిపడుతున్నారు..!!