బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ వచ్చేసిందిరోయ్.. నందమూరి ఫ్యాన్స్ ఎగిరి గంత్తెయండి రోయ్..!!

సోషల్ మీడియాలో ఏ హీరో ఫ్యాన్స్ నైనా ఆపగలమేమో కానీ నందమూరి ఫ్యాన్స్ ని ఆపలేము. దానికి కారణం కూడా అందరికీ తెలిసిందే. ఫుల్ జోష్ ..ఫుల్ ఆక్టివ్ .. ఫుల్ ఎనర్జిటిక్ ..ఎప్పుడు సందడి సందడిగా రెడ్ బుల్ తాగిన ఎనర్జీతో జోష్ ఫుల్ గా కనిపిస్తూ ఉంటారు నందమూరి ఫ్యాన్స్ . కాగా అలాంటి ఫ్యాన్స్ కు ఇంకా ఎనర్జీ ఇచ్చే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. తాజాగా సోషల్ మీడియాలో బాలయ్య ఫ్యాన్స్ కి సంబంధించిన ఒక న్యూస్ హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. బాలయ్య ప్రజెంట్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమాను ఓకే చేసిన విషయం తెలిసిందే.

ఈ సినిమా కోసం తీవ్రస్థాయిలో కష్టపడుతున్నాడు బాలయ్య . కాగా బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టైటిల్ టీజర్ ని రిలీజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారట మేకర్స్ . బాలయ్య జూన్ 10 పుట్టినరోజును జరుపుకోబోతున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య సినిమాకి సంబంధించిన టైటిల్ టీజర్ రిలీజ్ చేయాలి అంటూ మేకర్స్ నిర్ణయం తీసుకున్నారట. దీనికి సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ చేశారట . అంతేకాదు అదే రోజున అఖండ 2 సినిమా అఫీషియల్ అప్డేట్ కూడా రాబోతుంది అంటూ ఓ న్యుస్ ట్రెండ్ అవుతుంది. దీంతో సోషల్ మీడియాలో నందమూరి ఫ్యాన్స్ ఈ వార్తలను బాగా హైలైట్ చేస్తున్నారు.

అంతేకాదు కెరియర్ లోని ఫస్ట్ టైం అఖంద 2 కోసం బాలయ్య హ్యూజ్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. బోయపాటి శ్రీను ఈ సినిమాని అఖండకు మించిన రేంజ్ లో రాసుకున్నారట . కచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డును బద్దలు కొట్టబోతుంది అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు నందమూరి అభిమానులు..!!