చెనైలో రూ. 100 కోట్ల స్థలం అమ్మేసిన జయసుధ.. అసలు కార‌ణం ఇదే..

ప్రస్తుత కాలంలో బిజినెస్‌లకు కొదవ‌ లేదు. ఎన్నో రకాల బిజినెస్ లతో సెలబ్రిటీస్ బిజీ బిజీ అవుతూనే ఉన్నారు. ఓ పక్కన సినిమాల్లో నటిస్తూనే బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ అప్పట్లో ఎవరైనా డబ్బులు ఉంటే స్థలాలు, పొలాల పైనే ఇన్వెస్ట్ చేసేవారు. అలా చెన్నైలో శోభన్ బాబు కొన్న కొన్ని స్థలాలు ఇప్పుడు ఎన్నో కోట్ల విలువ చేస్తున్నాయి. ఇక అలా అప్పట్లో చెన్నైలో ఆస్తులు కొన్న వారిలో న‌టి జయసుధ ఒకటి. సహజనటిగా భారీ పాపులాటి దక్కించుకున్న ఈ అమ్మడు.. మొదట సినిమాల్లో హీరోయిన్గా నటించింది. తర్వాత తల్లిగా, అత్తగా, వదినగా ఎన్నో సినిమాల్లో కీల‌క‌ పాత్రలో నటించి మెప్పించింది. ఇప్పటికీ వరుస‌ సినిమాలతో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టిస్త‌తూ బిజీగా గడుపుతుంది.

ఓ ప‌క్క సినిమాల్లో నటిస్తూనే.. రాజకీయాల్లో కూడా జయసుధ కంటిన్యూ అవుతుంది. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సందడి చేసింది జయసుధ. ఆమె ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. గతం తాలూకా జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. నా అసలు పేరు సుజాత అని.. నా లైఫ్ కు టర్నింగ్ పాయింట్ జ్యోతి సినిమాతో మొదలైందని వివరించింది. నా సుజాత అనే పేరు తమిళ డైరెక్టర్ గుహనాదన్‌.. జయసదగా మార్చారు అంటూ వివరించింది. జయప్రద, శ్రీదేవి లాంటి గ్లామర్ హీరోయిన్స్ మధ్య నేను నేచురల్ బ్యూటీగా మంచి పేరు తెచ్చుకున్నానని అది చాలా గ‌ర్వంగా ఉంటుంద‌ని.. వాళ్లతో కలిసి నటించిన సినిమాలలో నాకు అవార్డులు కూడా వచ్చాయి.. అది చాలా ఆనందాన్ని కలుగజేస్తుందని విరించింది.

ఇక నా ఆస్తుల గురించి చెప్పాలంటే నేను చెన్నైలో అప్పట్లో ఓ బిల్డింగ్ కొన్నాను అది విని శోభన్ బాబు గారు చాలా మంచి పని చేశావు అంటూ ప్రశంసించారు. ఆ తర్వాత దాన్ని అమ్మేయాల్సిన సమయం వచ్చింది. అదే కాకుండా ఓ తొమ్మిది ఎకరాల స్థలాన్ని కూడా కొన్న.. ఆ స్థలంలో బోర్ వేస్తే పడకపోవడంతో దాన్ని కూడా అమ్మేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ స్థలం విలువ దాదాపు రూ.100 కోట్లు ఉంటుంది. ఆస్తులు వెనకేసుకోవడానికి కూడా అదృష్టం ఉండాలి అంటూ ఆమె వివరించింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవ్వడంతో అంత షాక్ అవుతున్నారు. ఆమె అవసరం లేదని అమ్మేసిన ఆ స్థలం విలువ ఇప్పుడు ఏకంగా రూ.100 కోట్లలో ఉందా అంటూ అంత ఆశ్చర్యపోతున్నారు.