ఎన్టీఆర్ టైం ఇంత దరిద్రంగా ఉంది ఏంట్రా బాబు.. దేవరకు మరో బిగ్ బొక్క..!

దేవర ..దేవర ..దేవర ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. నందమూరి అభిమానులు వేయికళ్లతో వెయిట్ చేస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఒక్క వార్త లీకైన సరే ఫ్యాన్స్ ఊగిపోతూ ఉంటారు . ఈ సినిమాలో ఎన్టీఆర్ చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు అని.. రిలీజ్ అయిన గ్లింప్స్ ఆధారంగా తెలిసిపోతుంది . దాదాపు ఈ సినిమా కోసం తారక్ ఆరు కేజీల బరువు తగ్గినట్లు కూడా తెలుస్తుంది.

మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులకి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి . అయితే దేవర సినిమాను మూడు బ్యాడ్ సెంటిమెంట్లు వెంటాడుతూ ఉండడం గమనార్హం . ఎన్టీఆర్ చివరగా ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించారు. ఇది పెద్ద హిట్ అయింది . రాజమౌళి దర్శకత్వంలో మూవీ తర్వాత ఆ హీరో ఏ డైరెక్టర్ తో చేసిన డిజాస్టర్ అవుతుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే .

గతంలో ఎన్టీఆర్ విషయంలో కూడా ఇదే జరిగింది . అంతేకాదు ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.. ఈ సినిమాలో తండ్రి కొడుకుల పాత్రలో కనిపిస్తాడు. గతంలో ఆయన నటించిన ఆంధ్రావాలా , శక్తి సినిమాల్లో ఇదేవిధంగా కనిపించాడు . ఆ సెంటిమెంట్ రిపీట్ అయినా సరే ఈ సినిమా ఫ్లాప్ అవడం తప్పదు అంటున్నారు జనాలు . ఎన్టీఆర్ నటించిన దసరాకి విడుదలైన మూవీస్ విజయం సాధించలేనివి ఎన్నో ఉన్నాయి . ఇప్పుడు దేవర కూడా దసరాకి రిలీజ్ కాబోతుంది . మరి ఈ మూడు బ్యాడ్ సెంటిమెంట్లను బ్రేక్ చేసి దేవర హిట్ అవుతుందా..? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది .ఇది అభిమానులకి పెద్ద తలనొప్పిగా మారిపోయింది. చూద్దాం ఏం జరుగుతుందో..?