టాప్ కమెడియన్ రాళ్లపల్లి లైఫ్ లో ఇన్ని కష్టాలా.. చూస్తే కన్నీళ్లు ఆపుకోలేం..

టాలీవుడ్ స్టార్ కమెడియన్ రాళ్లపల్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో మెప్పించిన ఆయన.. తన జీవితంలో ఎన్నో కష్టాలను చెవి చూసాడు. ఎన్నో విషాదాలను భరించాడు. స్త్రీ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన శుభలేఖ, బడాయి బసవయ్య, జగన్నాథ రథచక్రాలు, అభిలాష‌, శ్రీవారికి ప్రేమలేఖ, అగ్ని పుత్రుడు, భలే మొగుడు ఇలా ఎన్నో హిట్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు. ప్రేక్షకుల నవ్వించడమే ల‌ఞ్యంగా పెట్టుకున్న రాళ్లపల్లి అందుకోసం ఎంతో కృషి చేసేవాడు. ఇప్పటివరకు ఆయన నటన ద్వారా రెండు నంది అవార్డులను దక్కించుకున్నారు. ఈయన 2018, మే లో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

Rallapalli : Biography, Age, Movies, Family, Photos, Latest News - Filmy  Focus

ఇక‌ ప్రస్తుతం ఆయన లైఫ్ లో పడిన కష్టాలు, విషాదాలు మీడియాలో వైరల్ అవడంతో అంత ఆశ్చర్యపోతున్నారు. రాళ్లపల్లి మొదట నుంచి అయ్యప్ప స్వామి భక్తుడు. ఆయన కెరీర్ మొత్తంలో ఇప్పటికీ 28 సార్లు వరకు శబరిమలై వెళ్లారట. ఆగస్టు 15, 1945లో ఆయన జన్మించారు. ప్రతి ఏడాది ఆరోజు ఓ పేద కళాకారుడికి సన్మానం చేసి రూ.50వేలు ఇవ్వడం ఆయన నీయ‌మంగా పెట్టుకున్నారట‌. ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉన్న టైంలో కూడా ఆయన ఇలా సహాయం చేయడం మానేవారు కాదట. నాటకాలు అంటే ఆయనకు ప్రాణమని.. ఒకానొక టైంలో వాటికోసం అప్పులు కూడా చేసే వారిని.. ఏ స్థాయిలో అంటే ఓసారి ఇంట్లోనే సోఫాను కూడా అప్పులు కట్టడానికి అమ్మేశారని.. అప్పులవారి భయంతో ఇంటి వెనుక నుంచి వెళ్లే వారిని.. ఇవన్నీ ఆయన శిష్యుడు తనికెళ్ల భరణి కల్లారా చూసినట్లు వివరించారు.

డబ్బు కోసం అంతలా ఇబ్బంది పడ్డ ఆయన.. సినీ ఇండస్ట్రీకి వచ్చాక ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపరుచుకున్నారని చెప్పుకొచ్చాడు. ఇక రాళ్లపల్లి ఎప్పుడు ఎడమ చేతితోనే భోజనం చేస్తారట. అదేంటి ఎడమ చేతితో భోజనం చేస్తున్నారు అని అడిగితే.. అక్కడ ప్లేట్ పక్కన పెట్టేసి ఆయన వెళ్ళిపోతారట. దాన్ని ఆయన నియమంగా పెట్టుకున్నారట. ఇంతకీ అలాంటి నియమం ఎందుకు పెట్టుకున్నారు అనే ప్రశ్న ఇంటర్వ్యూలో ఆయనకు ఎదురుకాగా నేను ఓ లక్ష్యం కోసం అయ్యప్ప స్వామికి మొక్కుకున్న ఆ లక్ష్యం నెరవేరే వరకు ఎడమ చేతితోనే తింటూ.. మధ్యలో ఎవరైనా అడిగితే లక్ష్యానికి భంగం కలగకూడదని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేవాడిని అంటూ వివరించాడట.

Senior actor Rallapalli is no more - TeluguBulletin.com

ఇంతకీ ఆ లక్ష్యం ఏంటో తెలియదు ఒకవేళ ఆ లక్ష్యం నెరవేరకపోతే జీవితాంతం అలానే నియమాన్ని పాటిస్తా అంటూ ఆయన వివరించారు. అయితే ఆయన జీవితాన్ని అత్యంత కృంగ‌దీసిన విషయం పెద్ద కూతురు విజయమాధురి మరణం. డాక్టర్ చదువు కోసం రష్యా బయలుదేరిన ఆమె ఢిల్లీ వరకు ట్రైన్ లో వెళ్లాల్సి ఉండగా.. ఆ ట్రైన్ జర్నీలో బ్రెయిన్ ఫీవర్ తో మరణించింది. ఆగ్రా వెళ్లేలోపే ఆమె చనిపోయారు. దీంతో రాళ్లపల్లి చాలా ఎమోషనల్ అయినట్లు.. గుండెపగిలేలా రోదించినట్లు తెలుస్తోంది. నీ పుట్టకకు, నీ చావుకు కారణం నేనే అంటూ ఆయన బాధపడ్డారట కూతురిని డాక్టర్ చేయాలని లక్ష్యం ఆయనదేనని.. అందుకోసమే ఆమెను రష్యా పంపించార‌ని ఇంతలోనే ఆమె చనిపోవడంతో మానసికంగా రాళ్లపల్లి ఎంతగానో కృంగిపోయారని తెలుస్తోంది.