రామ్ చరణ్ ఫాన్స్ కు పండగ చేసుకునే న్యూస్.. చెర్రీ, బుచ్చి బాబు మూవీ గురించి షాకింగ్ సీక్రెట్ రివీల్ చేసిన సోహెల్..

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఇక చ‌ర‌ణ్ ఈ ప్రాజెక్ట్ తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్లో మరో సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమా విషయంలో చెర్రీ, బుచ్చిబాబు ఇద్దరు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇదివరకే ఈ సినిమాని ప్రకటించారు. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు సరవేగంగా జరుగుతున్నాయి. రా అండ్ రెస్ట్రిక్ కంటెంట్‌తో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం.

Syed Sohel: మా నాన్న రిటైర్‌మెంట్ పైసలు సినిమాకు పెట్టా.. కన్నీళ్లు  పెట్టుకున్న బిగ్ బాస్ సోహెల్-bigg boss sohel emotional comments in bootcut  balaraju pre release event syed sohel ...

రామ్‌చరణ్ ఈ సినిమాలో ఉత్తరాంధ్ర మండలికం డైలాగులు చెప్పబోతున్నాడట. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో షాకింగ్ విషయాన్ని బిగ్ బాస్ సోహెల్ రివీల్‌ చేశాడు. సోహెల్ కి రామ్ చరణ్ సినిమా సంగతులు ఎలా తెలుసు.. అని సందేహం రావచ్చు. కాగా సోహెల్‌ తాజాగా నటించిన బూట్ కట్ బాలరాజు సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూలో సందడి చేశాడు. ఆ ఇంటర్వ్యూలో సోహెల్ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. సోహెల్ మాట్లాడుతూ బుచ్చిబాబు అన్న నాకు బాగా క్లోజ్.. నేను రెగ్యులర్గా ఆయనతో మాట్లాడుతూ ఉంటా అంటూ వివ‌రించాడు.

Exclusive - Here's when the first look of Ram Charan-Buchi Babu sports  drama will be out

నా సమస్యలు కూడా ఆయనకు చెప్తాను. బుచ్చిబాబు అన్న నాకు అంత మంచి ఫ్రెండ్ అంటూ వివరించాడు. ఇక ఇటీవ‌ల‌ ఆయనను కలిశానని.. రామ్ చరణ్ అన్నతో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు మీకు ఇది నిజంగా బిగ్ అచీవ్మెంట్ అని చెప్పాను.. వెంటనే బుచ్చి బాబు అన్న మాట్లాడుతూ పాన్ ఇండియా కాదు అది పాన్ వరల్డ్ సినిమా అని చెప్పారంటూ వివరించాడు. సోహెల్ చేసిన ఈ వ్యాఖ్యలు రామ్ చరణ్ అభిమానుల్లో ఆనందాన్ని పెంచేసాయి. బుచ్చిబాబు ప్లానింగ్ మామూలుగా లేదు అంటూ అంత ఆశ్చర్యపోతున్నారు.