నటి పూనమ్ పాండే పై పోలీస్ స్టేషన్ లో కేస్.. మమ్మల్ని హర్ట్ చేసింది అంటూ..

బాలీవుడ్ నటి మోడల్ అయిన పూనమ్ పాండే ఇటీవల మరణించింది అంటూ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైర‌ల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయం అభిమానులతో పాటు.. స్నేహితులు, కొందరు కుటుంబ సభ్యులను కూడా బాధించింది. చాలామంది ఇది నిజమైన వార్త అని న‌మ్మారు. ఆమె వ్యక్తిగత సిబ్బంది నుంచి సర్వైకల్ కాన్సర్ తో పూనమ్‌ చనిపోయింది అని అఫీషియల్ ప్రకటన రావడంతో మొన్నటి నుంచి టీవీలు యూట్యూబ్‌లో సోషల్ మీడియాలో ఆ వార్త మారుమోగిపోయింది. అతి చిన్న వయసులోనే ఆమె ఇలా క్యాన్సర్ తో చనిపోవడం బాధాకరమని చాలా మంది ఫీలయ్యారు.

అదేవిధంగా ఆమె బాడీ కనిపించకపోవడంతో అంతిమ సంస్కారాలపై ఎలాంటి సమాచారం లేకపోవడం, కుటుంబ సభ్యులు కూడా దీనిపై స్పందించకపోవడంతో సోషల్ మీడియా వేదికగా సందేహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో పూనమ్‌ పాండే అందరికీ షాక్ ఇస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో పూనమ్‌ మాట్లాడుతూ నేను బతికే ఉన్నానని.. నాకు ఏ గర్భసయ్య క్యాన్సర్ రాలేదని.. ప్రస్తుతం దేశంలో ఎంతమంది మహిళలకు గర్భసయ క్యన్సర్‌తో బాధపడుతున్నారు.. దానికి సరైన ట్రీట్మెంట్ ఉందని అవగాహన లేక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.. ఇక ఈ కాన్సర్ పై అవగాహన కల్పిస్తూ తాను చనిపోయినట్లు ప్రచారం చేశానని పూనమ్ పాండే వివరించారు.

ఇదిలా ఉంటే దీనిపై ఆమె ఫ్యాన్స్ కొందరు ఆమెకు సపోర్ట్ గా మాట్లాడుతుండగా.. మరి కొందరు మాత్రం పూనమ్‌ పాండేను తిట్టిపోస్తున్నారు. అవగాహన కోసం నీకు మరో మార్గం కనిపించలేదా.. చనిపోయినట్లు అనౌన్స్ చేస్తే అభిమానులు ఎంతగా ఇబ్బంది పడతారో, బాధపడతారో నీకు తెలియదా.. అంటూ ఘాటు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ఒక అడుగు ముందుకేసి ఆమెపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. కేవలం గర్భసయ్య క్యాన్సర్ అవగాహన కోసం ఇలా చేసింది. అయితే ఇప్పటికే చాలామంది అభిమానులు ఆమె చనిపోయిందని ఎమోషనలై.. నివాళులర్పించారు. ఇదంతా ఫేక్ అని తెలియడంతో ఎంతో హర్ట్ అయ్యారని.. సినీవర్కర్ అసోసియేషన్ కేసులో వివరించింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.