ఆ విషయంలో సమంతని గుడ్డిగా ఫాలో అవుతున్న లావణ్య త్రిపాఠి..

సొట్టబుగ్గల సుంద‌రి లావణ్య త్రిపాఠి ఇటీవల మెగా కోడలు అయిన సంగతి తెలిసింది. గ‌తేడాది నవంబర్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ను వివాహం చేసుకున్న లావణ్య.. మెగా ఇంటి కోడలిగా అడుగు పెట్టింది. వీళ్ళ పెళ్లి ఇటలీలో ఘనంగా జరిగింది. వివాహానికి చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్‌చరణ్‌తోపాటు కుటుంబ సభ్యులంతా హాజరై సందడి చేశారు. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. మిస్టర్ మూవీలో జంటగా నటించిన వీరు ఒకరితో ఒకరు ప్రేమలో పడి కొన్నాళ ర‌హ‌స్య‌ ప్రేమాయణం తర్వాత ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు.

Miss Perfect' Lavanya Talks About Freedom Given By Mega Family! | 'Miss  Perfect' Lavanya Talks About Freedom Given By Mega Family

పెళ్లయ్యాక లావణ్య నటనకు గుడ్ బై చెప్పేస్తుంది అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే లావణ్య నటిస్తానని క్లారిటీ ఇచ్చేసింది. ఆమె నటించడం మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రిలీజ్ నేపథ్యంలో ప్రమోషన్స్ లో పాల్గొన్న లావణ్య పెళ్లయ్యాక నటన కొనసాగిస్తారా.. అనే ప్రశ్నకు స్పందిస్తూ నన్ను అర్థం చేసుకునే హస్బెండ్ దొరికాడు. నేను నటనను కొనసాగిస్తాను అంటూ వివరించింది. తెలుగులో సినిమా చేయబోతున్నట్లు వెల్లడించిన లావణ్య.. నాకు నటన విషయంలో ఎటువంటి ఆంక్షలు లేవని వివరించింది.

Miss Perfect (TV Series 2024– ) - IMDb

అయితే ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవడంతో మెగా కోడలు కూడా అక్కినేని కోడలు మాదిరిగానే పెళ్లి తర్వాత నటించాలని డిసైడ్ అయింది అంటూ తెలుస్తోంది. ఇక పెళ్లయిన తర్వాత సమంత న‌ట‌న‌లో లిమిట్స్‌దాటి పలు బోల్డ్ సినిమాల్లో కూడా నటించింది. ఇలా త‌న మ్యారేజ్ లైఫ్‌ నాశనం చేసుకుందంటూ గతంలో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇదే బాటలో లావణ్య వివాహం తర్వాత కూడా సినిమాల్లో నటించాలని డిసైడ్ అయింది ఇమె అయిన స‌రైన పాత్రలో నటిస్తూ మెగా కోడలుగా.. ఆ ఇంటి గౌరవాన్ని నిలబెడుతుందో.. లేదా సమంత లానే అవుతుందో చూడాలి అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.